ఓ కారులో టీడీపీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి బంధువులు రూ.1.23 లక్షలను తరలిస్తుండగా పోలీసు లు పట్టుకున్నారు. సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం...
మక్తల్, న్యూస్‌లైన్ : ఓ కారులో టీడీపీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి బంధువులు రూ.1.23 లక్షలను తరలిస్తుండగా పోలీసు లు పట్టుకున్నారు. సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం... శుక్రవారం ఉదయం మక్తల్ పట్టణంలోని నారాయణపేట క్రాస్‌రోడ్డు వద్ద తనిఖీ చేస్తుండగా స్థానిక ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి బంధువులు వెళుతున్న కారును ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి,హెడ్‌కానిస్టేబుల్ జమీరొద్దీన్, కాని స్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డి ఆపారు. అందు లో చిన్నచింతకుంట మండలం పర్కాపురానికి తరలిస్తున్న రూ.1.23 లక్షలతో పాటు పార్టీకి చెందిన 30 టీషర్టులను స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులకు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో తహశీల్దార్ సాయిరాంకు అప్పగించా రు. కాగా పట్టుబడిన కారు మహబూబ్‌నగర్‌లోని ఒక సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులు కౌసిక్‌రెడ్డి, శ్రీనివాసులును నారాయణపేట కోర్టులో హాజరుపరిచారు.
మంతటిగడ్డ సమీపంలో...
నాగర్‌కర్నూల్ : కేసీఆర్ బహిరంగ సభకు వచ్చిన ప్రజలకు డబ్బులు పం చుతున్న ఇద్దరు వ్యక్తులు ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోగా, మరో నలుగురు పరారయ్యారు. శుక్రవారం సాయంత్రం నాగర్‌కర్నూల్ నుంచి అచ్చంపేట వెళ్లే దారిలో మంతటిగడ్డ సమీపంలో టీఆర్‌ఎస్ బహిరంగసభకు వచ్చిన వారికి డబ్బులు పంపిణీ చేస్తున్నారని స్థానికులు కొందరు ఎస్‌ఐ రాజేశ్వర్‌గౌడ్‌కు సమాచారమిచారు. దీంతో ఆయన అక్కడికి వెళ్లి కారువంగకు చెందిన వెంకటరమణగౌడ్, రాములును పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.10,690 స్వాధీనం చేసుకోగా మరో నలుగురు వ్యక్తులు పారిపోయారు.