13న రాహుల్ పర్యటన ఖరారు | On 13, he finalized the tour | Sakshi
Sakshi News home page

13న రాహుల్ పర్యటన ఖరారు

Apr 5 2014 2:17 AM | Updated on Mar 18 2019 9:02 PM

13న రాహుల్ పర్యటన ఖరారు - Sakshi

13న రాహుల్ పర్యటన ఖరారు

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఈ నెల 13న ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సమాచారం అందింది.

తెలంగాణలో భారీ సభ, రోడ్‌షోలు!

 హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఈ నెల 13న ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పొన్నాల టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రులు కె.జానారెడ్డి, శ్రీధర్‌బాబు, షబ్బీర్‌అలీలతో సమావేశమై రాహుల్ షెడ్యూల్‌ను ఖరారు చేసే పనిలో పడ్డారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈనెల 16న సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్ మైదానంలో నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొననున్న నేపథ్యంలో రాహుల్‌గాంధీ అధ్యక్షతన ఏయే జిల్లాల్లో సభలు, రోడ్‌షోలు నిర్వహిస్తే బాగుంటుందనే అంశంపై చర్చిస్తున్నారు. ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండింటిని ఎంపిక చేసి భారీ బహిరంగ సభలు నిర్వహించే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. అదే విధంగా రాహుల్‌గాంధీతో రోడ్‌షో నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement