నితీశ్‌కు తప్పిన ప్రాణాపాయం | nitish kumar save the Helicopter accident | Sakshi
Sakshi News home page

నితీశ్‌కు తప్పిన ప్రాణాపాయం

Apr 28 2014 1:18 AM | Updated on Aug 14 2018 4:51 PM

నితీశ్‌కు తప్పిన ప్రాణాపాయం - Sakshi

నితీశ్‌కు తప్పిన ప్రాణాపాయం

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదివారం సాయంత్రం హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పెను గాలుల్లో చిక్కుకోవడంతో సహస్ర జిల్లాలో సోన్‌బర్సాలో పైలట్ అత్యవసరంగా కిందకు దించారు.

 పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదివారం సాయంత్రం హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పెను గాలుల్లో చిక్కుకోవడంతో సహస్ర జిల్లాలో సోన్‌బర్సాలో పైలట్ అత్యవసరంగా కిందకు దించారు. సోన్‌బర్సా రాజ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నితీశ్... అక్కడి నుంచి మధేపురాలో జరిగే సభకు వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కారు. హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొంతసేపటికే ఆ ప్రాంతంలో పెను గాలులు వీచాయి. సుమారు గంటపాటు (సాయంత్రం 4.30 నుంచి 5.30 వరకూ) వీచిన ఈ గాలుల్లో చిక్కుకున్న హెలికాప్టర్ కొన్ని నిమిషాలపాటు ఊగిసలాడింది. అన్ని వైపుల నుంచి బలమైన గాలులు వీస్తున్నా పైలట్ ఎలాగో అలా హెలికాప్టర్‌ను తిరిగి సోన్‌బర్సాలో అత్యవసరంగా కిందకు దింపారు. ఈ ఘటన అనంతరం నితీశ్ రోడ్డు మార్గంలో మధేపురాకు వెళ్లారు.
 
పాశ్వాన్‌కూ తప్పిన ముప్పు


 లోక్ జన్‌శక్తి పార్టీ (ఎల్‌జేపీ) అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ ఆదివారం ఎక్కిన హెలికాప్టర్ కూడా బలమైన గాలుల్లో చిక్కుకోవడంతో పైలట్ అత్యవసరంగా కిందకు దించాడు. దర్భంగా జిల్లా మీదుగా పాశ్వాన్ హెలికాప్టర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement