450 ‘నామా’లు పెడతాడు: నాగేశ్వర్‌రావు | Narayana takes on Nama Nageswara rao | Sakshi
Sakshi News home page

450 ‘నామా’లు పెడతాడు: నాగేశ్వర్‌రావు

Apr 15 2014 4:29 AM | Updated on Aug 29 2018 8:54 PM

450 ‘నామా’లు పెడతాడు: నాగేశ్వర్‌రావు - Sakshi

450 ‘నామా’లు పెడతాడు: నాగేశ్వర్‌రావు

ఇప్పటి వరకు ఖమ్మం ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావు ప్రజలకు ఇప్పటికే మూడు పంగనామాలు పెట్టాడని, కార్పొరేట్ సంస్థల పేరుతో బ్యాంకులకు రూ.450 కోట్లను ఎగ్గొట్టిన అతను, అదే సంఖ్యలో ప్రజలకు నామాలు పెడతాడని ఖమ్మం పార్లమెంట్ సీపీఐ అభ్యర్థి కె.నారాయణ విమర్శించారు.

 టీడీపీ నేత నాగేశ్వర్‌రావుపై నారాయణ విసుర్లు
 కుక్కునూరు,న్యూస్‌లైన్ : ఇప్పటి వరకు ఖమ్మం ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావు ప్రజలకు ఇప్పటికే మూడు పంగనామాలు పెట్టాడని, కార్పొరేట్ సంస్థల పేరుతో బ్యాంకులకు రూ.450 కోట్లను ఎగ్గొట్టిన అతను, అదే సంఖ్యలో ప్రజలకు నామాలు పెడతాడని  ఖమ్మం పార్లమెంట్ సీపీఐ అభ్యర్థి కె.నారాయణ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నారాయణ కుక్కునూరులో ప్రసంగించారు.
 
 సీపీఐ, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ముంపుప్రాంతాల సమస్యను అసెంబ్లీ, పార్లమెంట్‌లో వినిపిస్తామని తెలిపారు. పోలవరం ముంపు భూములకు ఎకరాకు రూ.10 లక్షలు ఆర్‌ఆర్ ప్యాకేజీ కింద, నిర్వాసిత  కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తామన్నారు. రాష్ట్ర విభజన విషయంలో టీడీపీ, సీపీఎంలు రెండుకళ్ల సిద్ధాంతాలను పాటిస్తున్నాయని నారాయణ విమర్శించారు. 

Advertisement
 
Advertisement
Advertisement