సీతమ్మ వెనక తోడు‘నీడ’ | Mla sitamma Always Follow her husband kottakota dayakar reddy leadership | Sakshi
Sakshi News home page

సీతమ్మ వెనక తోడు‘నీడ’

Apr 17 2014 1:36 PM | Updated on Aug 14 2018 5:54 PM

సీతమ్మ వెనక తోడు‘నీడ’ - Sakshi

సీతమ్మ వెనక తోడు‘నీడ’

ఆలోచన వారిది.. ఆచరణ వీరిది. డెరైక్షన్ వారిది.. యాక్షన్ వీరిది. వ్యూహం వారిది.. విజయం వీరిది.

ఆలోచన వారిది.. ఆచరణ వీరిది. డెరైక్షన్ వారిది.. యాక్షన్ వీరిది. వ్యూహం వారిది.. విజయం వీరిది. ఇలా రాజకీయాల్లో ప్రతినాయకుడి వెనక  తోడు‘నీడ’గా ఎవరో ఒకరు ఉంటారు. వారు బయటికి కనిపించకపోయినా.. తెరవెనక చక్రం తిప్పుతుంటారు. ఇక భార్యాభర్తలు ఇద్దరు ప్రజాప్రతినిధులైనా.. దేవరకద్ర ఎమ్మెల్యే సీతమ్మ వెనక, ఆమె భర్త కొత్తకోట దయాకర్‌రెడ్డి ఈ జాబితాలోనే ఉన్నారు.

రాజకీయాల్లో ఒకరికొకరు తోడునీడగా నడుస్తున్నారు. 2001కి ముందు గృహిణిగా ఉన్న సీతమ్మను అదే సంవత్సరంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థిగా గెలిపించారు దయాకర్‌రెడ్డి. ఆ తరువాత ఆమె జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అయితే తన భర్త స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని సీతమ్మ చాలా సందర్భాల్లో చెప్పారు.

2009 సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొత్తగా ఏర్పడిన దేవరకద్ర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా సీతమ్మను పోటీచేయించి గెలిపించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి సీతమ్మ రెండోసారి పోటీచేస్తున్నారు. ఈసారి కూడా భార్య గెలుపు కోసం భర్త అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఎన్నికల నామినేషన్ మొదలుకొని.. ప్రచారంలో వ్యూహ ప్రతివ్యూహాలు పన్నడంలో దయాకర్‌రెడ్డి దిట్ట. ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడలను తనదైనశైలిలో తిప్పికొట్టడం ఆయన రాజకీయ చతురతకు నిదర్శనం.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement