రైలుపట్టాలు పేల్చేసిన మావోయిస్టులు | Maoists blast railway track in Jharkhand | Sakshi
Sakshi News home page

రైలుపట్టాలు పేల్చేసిన మావోయిస్టులు

Apr 17 2014 8:55 AM | Updated on Oct 9 2018 2:51 PM

జార్ఖండ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బొకారో జిల్లాలో రైలు పట్టాలను గురువారం తెల్లవారుజామున పేల్చేశారు.

జార్ఖండ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బొకారో జిల్లాలో రైలు పట్టాలను గురువారం తెల్లవారుజామున పేల్చేశారు. డానియా నుంచి జోగేశ్వర్ బీహార్ స్టేషన్ల మధ్య దాదాపు ఒకటిన్నర మీటర్ల పొడవున రైల్వే ట్రాకును మావోయిస్టులు ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆరు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

వీటిని ఇంకా ఇప్పటివరకు పునరుద్ధరించలేకపోయారు. గురువారం మధ్యాహ్నానికి వీటిని పునరుద్ధరించే అవకాశం కనిపిస్తోంది. జార్ఖండ్లోని ఆరు లోక్సభ స్థానాలకు గురువారం నాడు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు ఇప్పటికే పిలుపునిచ్చారు. రాంచీ, జంషెడ్పూర్, చైబసా, ఖుటి, గిరిద్, హజారీబాగ్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement