రాముడి అవతారంలో కేసీఆర్! | kcr Incarnation in ramudu | Sakshi
Sakshi News home page

రాముడి అవతారంలో కేసీఆర్!

Apr 26 2014 4:00 AM | Updated on Aug 15 2018 9:06 PM

రాముడి అవతారంలో కేసీఆర్! - Sakshi

రాముడి అవతారంలో కేసీఆర్!

,మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లో శుక్రవారం జరిగిన కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభ సందర్భంగా కోడ్ ఉల్లంఘించారని స్థానిక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డికి రిటర్నింగ్ అధికారి కీమ్యానాయక్ నోటీసులు జారీచేశారు.

నాగర్‌కర్నూల్,మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లో శుక్రవారం జరిగిన కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభ సందర్భంగా  కోడ్ ఉల్లంఘించారని స్థానిక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డికి రిటర్నింగ్ అధికారి కీమ్యానాయక్ నోటీసులు జారీచేశారు. బహిరంగసభ ప్రవేశ ద్వారం వద్ద ధనుస్సు, బాణాలు ధరించిన శ్రీరాముడి అవతారంలో కేసీఆర్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు.

ఈ సభను ఎన్నికల బృందం, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పరిశీలించి వీడియో, ఫొటోలు తీశారు. ఎన్నికల్లో మతపరమైన అంశాలతో కూడిన ప్రచారం చేయడం కోడ్‌ఉల్లంఘన కిందికి వస్తుందని, రిప్రజెంటేషన్ పీపుల్స్‌యాక్ట్ (ఆర్పీయాక్ట్) 1951 ప్రకారం 129 సెక్షన్ కింద కేసునమోదు చేశామని రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. దీనిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి జనార్దన్‌రెడ్డికి నోటీసులు ఇచ్చామని తెలిపారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement