గుసగుస - కావూరికి దారేదీ? | Kavuri at crossroads | Sakshi
Sakshi News home page

గుసగుస - కావూరికి దారేదీ?

Mar 20 2014 12:03 PM | Updated on Aug 10 2018 8:01 PM

గుసగుస - కావూరికి దారేదీ? - Sakshi

గుసగుస - కావూరికి దారేదీ?

కావూరికి ఛాన్సిస్తే ఏలూరు సీటు కొల్లేరయిపోతుందని కూడా హెచ్చరిస్తున్నారట తెలుగు తమ్ముళ్లు!

పరీక్ష రాయించినా ఫలితం ఉండేట్టు కనిపించడం లేదు పాపం కావూరికి. ఆయన తన మద్దతుదారులందరికీ 'నేనే పార్టీలో చేరాలో చెప్పండి' అంటూ ప్రశ్న వేశారు. ఈ మేరకు ఒక కాగితం ముక్క కూడా ఇచ్చారు. వేర్వేరు పార్టీల పేరు ఇచ్చి, మీకు నచ్చిన దానికి ఓటేయండి అన్నారట. అందరూ 'తెలుగుదేశం' అన్నారట!


ఇంకేముంది? రిజల్టు వచ్చేసింది అంటూ ఆయన పచ్చ కండువాలు రెడీ చేసుకున్నారట. అప్పటికే ఏలూరు ఎంపీ సీటుకు అనేక ఏళ్లుగా టవల్ వేసేసుకుని కూర్చున్న మాగంటి బాబు మాత్రం 'అసలిది పరీక్షే కాదు. ఈ ఫలితం చెల్లదు. 'శృతి నాది ... రివాల్వరూ నాదే' స్టయిల్లో 'సీటూ నాదే ఓటూ నాదే' అంటున్నారట. కావూరికి ఛాన్సిస్తే ఏలూరు సీటు కొల్లేరయిపోతుందని కూడా హెచ్చరిస్తున్నారట.

Advertisement
 
Advertisement
Advertisement