బంగారు తెలంగాణను ఆవిష్కరింపజేయడంలో టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు సమర్థుడని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు అన్నారు
హైదరాబాద్ బంగారు తెలంగాణను ఆవిష్కరింపజేయడంలో టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు సమర్థుడని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు అన్నారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి హాజరైన కేకే పలు విషయాలపై మాట్లాడారు. కేసీఆర్ లాంటి వారు అరుదుగా ఉంటారని, టీఆర్‌ఎస్‌ను ఏనాడూ కాంగ్రెస్‌లో కలుపుతానని ఆయన అనలేదన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌లు కల్పించడంలో సందేహం అక్కర్లేదని, 2 సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలపై అవగాహన కుదరకే సీపీఐతో పొత్తు కుదరలేదని అన్నారు.