పెరిగిన నామినేషన్లు | increasing the nominations to mptc,zptc | Sakshi
Sakshi News home page

పెరిగిన నామినేషన్లు

Mar 19 2014 3:13 AM | Updated on Sep 2 2017 4:52 AM

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జడ్‌పీటీసీకి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోగా, భోజన విరామం తర్వాత సాయంత్రం ఐదు గంటల లోపు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్‌లు వేశారు.

ఇందూరు, న్యూస్‌లైన్ :  జడ్‌పీటీసీకి, ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం నామినేషన్‌ల జోరు పెరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జడ్‌పీటీసీకి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోగా, భోజన విరామం తర్వాత సాయంత్రం ఐదు గంటల లోపు  ఆరుగురు అభ్యర్థులు నామినేషన్‌లు వేశారు. పిట్లం మండలానికి చెందిన ప్రతాప్‌రెడ్డి టీఆర్‌ఎస్ తరపున రెండు సెట్ల నామినేషన్‌లు దాఖలు చేశారు. ఇటు మండల కార్యాలయాలలో ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 134 నామినేషన్‌లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి 36, టీడీపీ నుంచి 15, టీఆర్‌ఎస్ నుంచి 33, బీజేపీ నుంచి 18, స్వతంత్రులు 32 మంది నామినేషన్లు వేశారు.

 వాహనదారులు ఇబ్బందుల పాలు
 జిల్లా పరిషత్ ముందు పోలీసులు రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేయడంతో వాహన దారు లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా పరిషత్ దాటిన తర్వాత నాందేవ్‌వాడ, దుబ్బ, గౌతంనగర్, హమల్‌వాడీ, చంద్రశేఖర్ కాలనీ, ఎన్‌జీఓస్ కాలనీలున్నాయి. ఈ ప్రాంత ప్రజలు తమ నివాసాలకు వెళ్లాలంటే జిల్లా పరిషత్ రోడ్డు మీద నుంచి వెళ్లాలి. పోలీసులు ఈ దారిని మూసివేయడంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. నామినేషన్ కేంద్రానికి రోడ్డుకు కొద్ది దూరంలో ఉన్నప్పటికీ  పోలీసులు రోడ్డును బ్లాక్ చేయడంపై నిరనసలు వ్యక్తం అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement