అమ్మ మాట.. | i proud to say my son sacrificed his life for telangana | Sakshi
Sakshi News home page

అమ్మ మాట..

Apr 19 2014 1:10 AM | Updated on Aug 14 2018 4:46 PM

నా కొడుకు జీవన్ తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసినందుకు గర్వంగా ఉంది. వాడెప్పుడూ తెలంగాణ కోసమే ఆవేదన చెందేవాడు. ఆ ఆవేదనే కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పింది.

తెలంగాణ కోసం నా కొడుకు చనిపోవడం గర్వంగా ఉంది
 నా కొడుకు జీవన్ తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసినందుకు గర్వంగా ఉంది. వాడెప్పుడూ తెలంగాణ కోసమే ఆవేదన చెందేవాడు. ఆ ఆవేదనే కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పింది. 2010, జనవరి 28 జీవన్ చనిపోయిండు. ఆ తర్వాత నాలుగేళ్లకు తెలంగాణ అచ్చింది. తెలంగాణ అచ్చినందుకు సంతోషంగా ఉన్నా కొడుకు లేడని బాధగా ఉంది. కొత్త రాష్ట్రంలోనైనా యువకులకు ఉద్యోగాలివ్వాలి. రైతులకు సాగునీరు, కరెంటు అందించాలి. ప్రాజెక్టులు కట్టించి బీడు భూములను సాగులోకి తీసుకురావాలి.
 
 భవిష్యత్తులో ఏ బిడ్డా ఉద్యోగాల లేవని చనిపోకూడదు. చదువుకున్నోళ్లందరకు ఉద్యోగాలివ్వాలి. చదువు కూడా అందరికీ ఉచితంగా చెప్పాలి. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి. మహిళలకు కడుపుకోత లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. కరెంటు ఎక్కువ తయారుచేసి అందరికీ కోతల్లేకుండా అందించాలి. గ్రామాల్లో రోడ్లు, మంచినీరు సక్రమంగా అందించాలి. ఆస్పత్రుల్లో పేదలందరికీ మెరుగైన వైద్యం అందించాలి. అన్ని  సౌకర్యాలు కల్పించాలి. తెలంగాణలో మరే తల్లికి కడుపుకోత ఉండకుండా చూసుకోవాలి.
 - సేకరణ: రాజశేఖర్,  జగిత్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement