హమ్మయ్య.. బతికిపోయాం.. | happy in leaders due to local body elections results postpone | Sakshi
Sakshi News home page

హమ్మయ్య.. బతికిపోయాం..

Apr 8 2014 3:38 AM | Updated on Aug 29 2018 8:54 PM

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వాయిదా పడటంతో అసెంబ్లీకి పోటీకి నిలిచే అభ్యర్థులు, రాజకీయ నాయకులు ఆనందపడుతున్నారు.

ఆర్మూర్, న్యూస్‌లైన్:  మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వాయిదా పడటంతో అసెంబ్లీకి పోటీకి నిలిచే అభ్యర్థులు, రాజకీయ నాయకులు ఆనందపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ప్రకటించాలని భావించిన పలు పార్టీల నాయకులకు కోర్టు నిర్ణయం నూతనోత్తేజానికి కలిగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల వాయిదా తరహాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా వాయిదా వేస్తే బాగుండునని అసెంబ్లీ అభ్యర్థులు భావించారు. అయితే ఈనెల 2న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రకటించాల్సి ఉండగా హైకోర్టు ఈనెల 9న ఫలితాలను ప్రకటించాలంటూ వాయిదా వేసింది.

ఇలాంటి పరిస్థితుల్లో అత్యున్నత న్యాయస్థానం సార్వత్రిక ఎన్నికలు ముగిశాక మే 10న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని సోమవారం నిర్ణయించింది. దీంతో కౌన్సెలర్ అభ్యర్థుల ఫలితాల అనంతరం చైర్ పర్సన్ ఎంపికకు మరో వారం రోజుల సమయం ఉండే పరిస్థితులుంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ప్రకటించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో పట్ల పలు పార్టీల నాయకులు సంతోషం వెలిబుచ్చుతున్రాను. జస్టిస్ జ్ఞానసుధామిశ్రా, జస్టిస్ గోపాలగౌడతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను వాయిదా వేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల జాతరలో భాగంగా నిర్వహిస్తున్న మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలన్నీ మార్చి, ఏప్రిల్ నెలలోనే ఉండటంతో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యతలన్ని తమ భుజాలపై వేసుకొని నడిపించే అసెంబ్లీ అభ్యర్థులకు తలనొప్పిగా మారింది.

 మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ సింబల్‌పై జరిగినప్పటికీ స్థానికంగా అభ్యర్థులకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్‌తోనే ఓటర్లు స్పందిస్తారు. ఈ రెండు ఎన్నికల్లో ఓటర్లు పార్టీలకు పెద్దగా ప్రాధాన్యతనివ్వకుండా తమకు అందుబాటులో ఉండే అభ్యర్థులను గెలిపించుకోవాలని చూస్తారు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించని పక్షంలో ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై తీవ్రంగా ఉంటుందని అసెంబ్లీ అభ్యర్థులు ఆందోళన వ్యక్త చేశారు. జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు ఉండగా నిజామాబాద్ కార్పొరేషన్, ఆర్మూర్, కామారెడ్డి, బోధన్‌లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. వీటితో పాటు బాల్కొండ, బాన్సువాడు, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్, జుక్కల్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అసెంబ్లీ అభ్యర్థులకు మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల వాయిదా కలిసి వచ్చే అంశంగా మారింది.

 పని చేసే వారికి కొదవ ఉండదు..
 సార్వత్రిక ఎన్నికలకు ముందే మున్సిపల్, స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తే ఓటమి పాలైన అభ్యర్థులు ఆయా పార్టీల తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పని చేయడానికి ఆసక్తి చూపించరు. కానీ ఫలితాలు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ప్రకటించే పరిస్థితుల్లో అన్ని నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో పార్టీ టికెట్‌పై పోటీకి నిలిచిన మున్సిపల్ కౌన్సెలర్, జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికల్లో సైతం పని చేసే అవకాశం ఉంటుందని అసెంబ్లీ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement