‘అనంత’ సహకార పీఠాలు వైఎస్సార్‌సీపీ వశం | District Cooperative Central Bank ysrcp is Retaken | Sakshi
Sakshi News home page

‘అనంత’ సహకార పీఠాలు వైఎస్సార్‌సీపీ వశం

May 12 2014 1:37 AM | Updated on Sep 2 2017 7:14 AM

అనంతపురం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయభేరి మోగించారు.

అనంతపురం, న్యూస్‌లైన్: అనంతపురం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయభేరి మోగించారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో డీసీసీబీ చైర్మన్‌గా లింగాల శివశంకర్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఆనందరంగారెడ్డి.. డీసీఎంఎస్ చైర్మన్‌గా బోయ మల్లికార్జున, వైస్ చైర్మన్‌గా నార్పల జయరామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి అధికారులు డి క్లరేషన్లు అందజేశారు. డీసీసీబీలోని 21 డెరైక్టర్ స్థానాల్లో 14 స్థానాలను, డీసీఎంఎస్ పరిధిలో ఉన్న 10 డెరైక్టర్ స్థానాల్లో ఏడింటిని వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఏకగ్రీవం చేసుకోవడంతో చైర్మన్, వైఎస్ చైర్మన్‌ల ఎన్నిక ఏకపక్షమైంది.

Advertisement
 
Advertisement
Advertisement