breaking news
the YSR Congress Party
-
రండి.. ప్రభుత్వాన్ని నిలదీద్దాం
కర్నూలు (అగ్రికల్చర్): షరతుల్లేని రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేప ట్టేందుకు పిలుపునిచ్చింది. రుణమాఫీ విషయంలో ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ నగరంలో కార్పొరేషన్ ఎదుట, అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టేందుకు పార్టీ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికా రంలోకి రావడమే ధ్యేయంగా అన్ని రకాల వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే హామీలకు నీళ్లొదలడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రైతు రుణమాఫీకి రోజుకో ప్రకటన.. పూటకో నిబంధన మారుస్తూ అడ్డగోలు కోత విధుస్తుండటంతో రైతులు గుర్రుమంటున్నారు. 2013 డిసెంబర్ చివరి వరకు రుణాలు తీసుకున్న 5.24 లక్షల మంది రైతుల వివరాలను బ్యాంకర్లు ప్రభుత్వానికి నివేదించారు. వీటిని ఆధార్, ఇతరత్రా నిబంధనల పేరిట కోత విధిస్తుండటంతో రుణమాఫీ కొందరికే పరిమితమవుతోంది. ఈ విషయంలోనూ స్పష్టత లేకపోవడంతో రైతులపై జనవరి 1 నుంచి అక్టోబర్ వరకు రూ.261 కోట్ల వడ్డీ భారం పడుతోంది. ఇక ఎన్నికల ముందు డ్వాక్రా రుణాల మాఫీకి బాబు స్పష్టమైన హామీ ఇచ్చినా.. అధికారంలోకి రాగానే తూట్లు పొడిచారు. రివాల్వింగ్ ఫండ్ కింద సంఘానికి రూ.లక్ష ఇస్తున్నట్లు ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. ఈ మొత్తం ఎప్పటికి విడుదలవుతుందో కూడా తెలియని పరిస్థితి. రైతులు, డ్వాక్రా మహిళల నమ్మకాన్ని వమ్ము చేసిన ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు బుధవారం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆందోళనలను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. అదేవిధంగా కర్నూలులో నగరపాలక సంస్థ ఎదుట చేపట్టనున్న ఆందోళనకు రైతులు, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కోరారు. -
మేమున్నాం..
భూసమీకరణపై రాజధాని గ్రామ రైతులకు వైఎస్సార్ సీపీ భరోసా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి అవసరమైతే బలవంతంగా భూ సేకరణ చేస్తామన్న ప్రభుత్వ హెచ్చరికలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టింది. తొలిదశలో భూ సమీకరణ చేస్తామన్న తుళ్లూరు మండలంలోని 14 గ్రామాల్లో ఒకటైన మందడంలో ఆదివారం వైఎస్సార్ సీపీ నేతలు పర్యటించారు. రైతుల్లో మనోధైర్యం నింపారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మా శవాల మీదుగా రాజధాని నిర్మించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమయ్యారని మందడం రైతులు ఆవేదన వెలిబుచ్చారు. రైతుల మధ్య ఐక్యత లేకుండా తెలుగుదేశం పార్టీ గండి కొడు తోందని ఆందోళన వ్యక్తం చేశారు. భూములులాక్కుంటే బతికేదెలా అని భావోద్వేగానికి గురయ్యారు. అన్నదాతలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలవాలని కోరారు. మందడం(తుళ్లూరు) ప్రజాభీష్టాన్ని కాదని రాజధాని నిర్మించలేరు, రైతులకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం భూములు తీసుకోలేదు, ఒకవేళ ఆ పరిస్థితే ఎదురైతే రైతులకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ నిలబడి పోరాటం చేస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అన్నారు. ఆదివారం మర్రి రాజశేఖర్‌తో కలిసి ఆ పార్టీ నేతలు అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ముస్తఫా, తాడికొండ ఇన్చార్జి హెనీ క్రిస్టినా, సమన్వయకర్త కత్తెర సురేష్‌కుమార్ తదితరులు మందడం గ్రామం వెళ్లి రైతులతో సమావేశమయ్యారు.ముందుగా వారి సమస్యలు, ఆవేదనను విన్నారు. అనంతరం మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ, ఓ వర్గానికి చెందిన పత్రికలు, మీడియాలలో 80 నుంచి 90 శాతం మంది రైతులు భూములు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారంటూ కథనాలు వస్తున్నాయి. ఇక్కడి పరిస్థితులు అందుకు భిన్నంగా వుండడాన్ని చూస్తే ఆశ్చర్యంగా వుందన్నారు. సారవంతమైన ఈ భూములను రైతులను కాదని ప్రభుత్వం తీసుకోలేదని, ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే రైతులకు అండగా వైఎస్సార్ సీపీ నిలబడి పోరాటం చేస్తోందని ఆయన అభయం ఇచ్చారు. రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో బినామీ భూములు వున్న నేతలు చాలమంది వు న్నారు. వారి భూముల్లో ప్రభుత్వం రాజధాని నిర్మిస్తే బాగుంటుంది. చెమటోడ్చి సంపాదించుకున్న భూములను బలవంతంగా లాక్కోవాలని చూడటం ఈప్రభుత్వానికి తగదు. ఇక్కడి పరిస్థితులను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకు వెళ్లి రైతుకు బాసటగా నిలుస్తామన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణంలో చిన్న,సన్నకారు రైతులే ఎక్కువ నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం మూడు పంటలు పండే భూములు తీసుకునే అవకాశం లేదు. ముఖ్యంగా ఈ ప్రాంత భూములు నిర్మాణాలకు అనువైనవి కావన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ తాడికొండ నియోజకవర్గ ప్రజలకు అండగా వుంటానన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి హెనీక్రిస్టినా మాట్లాడుతూ.. రైతులు చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేరు. ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి, రాజధానికి భూములు ఇమ్మంటే ఇచ్చేపరిస్థితిలో తుళ్లూరు మండల రైతులు లేరు. రైతుల పక్షాన పోరాటానికి మేమంతా సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్, మండల పార్టీ నాయకులు కొమ్మినేని కృష్ణారావు, నాయుడు నాగేశ్వరరావు, బత్తులకిషోర్, కొప్పుల శేషగిరిరావు, ఎస్సీసెల్ నాయ కులు ఆరేపల్లి జోజి, తాడికొండ నాయకులు తియ్యగూర బ్రహ్మారెడ్డి, నాయకులు అక్కల లక్ష్మీనారాయణరెడ్డి, కటికల సాంబిరెడ్డి, పుట్టి సుబ్బారావు, అమర్నాథ్ రెడ్డి, రైతు నాయకులు మల్లెల శేషగిరిరావు,బెజ వాడ రమేష్,ఆలూరి శ్రీనివాసరావు ఇంకా గ్రామ రైతులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నేతల ఎదుట మందడం రైతులు వెలిబుచ్చిన బాధలు అక్కడ ఉన్న అందరి కళ్లను చెమర్చాయి. భూములపై వారికున్న మమకారాన్ని తెలియజేశాయి. పంటలు పండించేందుకు వారు పడుతున్న కష్టాలను తెలియ జెప్పాయి. తెలుగుదేశం ప్రభుత్వం భూములు లాక్కుంటే రైతు అనాథలవు తారని తెలియజెప్పారు. ఆ పరిస్థితే వస్తే వారి శవాల మీద రాజధాని నిర్మాణం జరుగుతుందన్నారు. ఆ రైతుల్లో కొందరి మాటలు ఇలా... టీ కప్పులు కడిగి భూమి కొనుక్కున్నా... అర ఎకరం పొలం వున్న రైతులు తమ బిడ్డలను ఇంజనీర్లు, డాక్టర్లను చేశారు. అలాంటి భూములను ఎట్టిపరిస్థితిల్లో ఇచ్చేది లేదు. రుణ మాఫీకి డబ్బులు లేని చంద్రబాబు రైతులకు కౌలు చెల్లించేందుకు డబ్బులు ఎక్కడ నుంచి తెస్తారు. టీ కప్పులు కడిగి 22 సంవత్సరాల క్రితం 72 సెంట్లు భూమి కొన్నాను. ఇప్పడు ఆ భూమి పోతే ఎలా బతకాలి. - ఆలూరి శ్రీనివాసరావు,రైతు -
‘అనంత’ సహకార పీఠాలు వైఎస్సార్సీపీ వశం
అనంతపురం, న్యూస్‌లైన్: అనంతపురం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయభేరి మోగించారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో డీసీసీబీ చైర్మన్‌గా లింగాల శివశంకర్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఆనందరంగారెడ్డి.. డీసీఎంఎస్ చైర్మన్‌గా బోయ మల్లికార్జున, వైస్ చైర్మన్‌గా నార్పల జయరామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి అధికారులు డి క్లరేషన్లు అందజేశారు. డీసీసీబీలోని 21 డెరైక్టర్ స్థానాల్లో 14 స్థానాలను, డీసీఎంఎస్ పరిధిలో ఉన్న 10 డెరైక్టర్ స్థానాల్లో ఏడింటిని వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఏకగ్రీవం చేసుకోవడంతో చైర్మన్, వైఎస్ చైర్మన్ల ఎన్నిక ఏకపక్షమైంది.