బాబుకు మైనంపల్లి.. మైనంపల్లికి కాంగ్రెస్.. షాక్ | Congress shock to mynampally hanumantha rao | Sakshi
Sakshi News home page

బాబుకు మైనంపల్లి.. మైనంపల్లికి కాంగ్రెస్.. షాక్

Apr 8 2014 2:26 AM | Updated on Oct 8 2018 8:52 PM

బాబుకు మైనంపల్లి..  మైనంపల్లికి కాంగ్రెస్.. షాక్ - Sakshi

బాబుకు మైనంపల్లి.. మైనంపల్లికి కాంగ్రెస్.. షాక్

తెలుగు దేశం, బీజేపీ పొత్తుతో మల్కాజ్‌గిరీ అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డ టీడీపీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు షాక్ ఇచ్చారు.

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు దేశం, బీజేపీ పొత్తుతో మల్కాజ్‌గిరీ అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డ టీడీపీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. ఢిల్లీకి వచ్చిన ఆయన కాంగ్రెస్‌లో చేరారు. సోమవారం ఉదయం ఆయనను వెంటపెట్టుకుని వచ్చిన  టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్వయంగా తన కారులో తీసుకెళ్లి మరీ దిగ్విజయ్‌తో సమావేశపర్చారు.

వార్‌రూంలో ఏపీ లోక్‌సభ, శాసనసభ అభ్యర్థుల జాబితాకు సంబంధించి కాంగ్రెస్ భేటీ జరుగుతుండగానే ఇద్దరు నేతలు ఒకే కారులో వార్‌రూంకి చేరుకున్నారు. దాదాపు అరగంటపాటు భేటీ అయిన అనంతరం తిరిగి వెళ్లారు. ఇంకేముంది మైనంపల్లి మల్కాజ్‌గిరి కాంగ్రెస్ టికెట్ కన్‌ఫర్మ్ అని అంతా అనుకున్నారు. తీరా సోమవారం సాయంత్రం జాబితాలో మరొకరి పేరు చూసి షాక్ తినడం మైనంపల్లి వంతైంది. కాంగ్రెస్సా... మజాకా!.
 

Advertisement
 
Advertisement
Advertisement