'కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదు' | congress party did not give telangana, says kesavarao | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదు'

Mar 19 2014 4:43 PM | Updated on Sep 2 2017 4:55 AM

'కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదు'

'కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదు'

తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని, ప్రజలే తెచ్చుకున్నారని టీఆర్ఎస్ నేత కె.కేశవరావు అన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని, ప్రజలే తెచ్చుకున్నారని టీఆర్ఎస్ నేత కె.కేశవరావు అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీ కాంగ్రెస్ నేతలను చూస్తే సిగ్గేస్తుందని ఆయన చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా కిరణ్ పైసా ఇవ్వనంటే టి.కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ఒక్క తెలంగాణ విద్యార్థికైనా బెయిల్ ఇప్పించారా, తెలంగాణ సమస్య పరిష్కారానికి నా ప్రాణాలైనా ఇస్తామనే కాంగ్రెస్ నేత ఎవరైనా ఉన్నారా అని నిలదీశారు.

అలాగే, కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మరో టీఆర్ఎస్ నేత నాయిని నరసింహారెడ్డి విమర్శించారు. ఒక్క రోజు కూడా జై తెలంగాణ అనని టి.కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మాత్రం తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని,
కాంగ్రెస్‌కు ఓటేస్తే ఢిల్లీకి రిమోట్ ఇచ్చినట్లేనని నాయిని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement