నిరాశే మిగిలింది | congress defeated in telangana politics | Sakshi
Sakshi News home page

నిరాశే మిగిలింది

May 21 2014 2:12 AM | Updated on Mar 18 2019 7:55 PM

నిజామాబాద్ కార్పొరేషన్ ఈ దఫా కూడా కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నం విఫలమైంది. మేయర్ పీఠాన్ని రెండవ సారి దక్కిం చుకునేందుకు ఆ పార్టీ వుహ్యరచన చేసింది.

 నిజామాబాద్‌సిటీ, న్యూస్‌లైన్ : నిజామాబాద్ కార్పొరేషన్ ఈ దఫా కూడా కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నం విఫలమైంది. మేయ ర్ పీఠాన్ని రెండవ సారి దక్కిం చుకునేందుకు ఆ పార్టీ వుహ్యరచన చేసింది. వారం రోజుల క్రి తం కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల అభ్యర్థులను మహారాష్ట్రకు తీసుకువెళ్లారు. కార్పొరేషన్ ఎన్నిక ల్లో ఆయా పార్టీలు గెలుచుకున్న స్థానాలు పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌తో జతకడితే మేయరు స్థానాన్ని కైవసం చేసుకుంటుదని అంతా భావించారు. కాని గత సోమవారం హై దరాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ఎంఐఎంతో పొత్తు ఖరారు కావటంతో మున్సిపల్ కార్పొరేషన్‌లో పరిస్థితులు చిన్నాభిన్నమైనవి.
 
 ఎంఐఎం పార్టీకి కూడా కాంగ్రెస్ పార్టీతో సమానంగా 16 సీట్లు వచ్చాయి. దాంతో ఎంఐ ఎం నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్టీ కి మద్దతు తెలిపి పొ త్తులో భాగంగా బోధన్ చైర్మన్ పదవి ఎంఐఎం తీసుకోనుంది. మారిన ఈ సమీకరణాల తో మొదటినుంచి నిజామాబాద్ మే యర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీయే కైవ సం చేసుకుంటుందనుకు న్న ఆ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. మున్సిపల్ ఎ న్నికల ఫలితాలు వెలువడిన మరుక్ష ణం నుంచే మేయర్ స్థా నాన్ని దక్కిం చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పలు వి దాలుగా ఆలోచన చేసినప్పటికి ఫలి తం లేకుండాపోయింది.
 
 టీఆర్‌ఎస్ త మకే మద్దతు ఇస్తుందనుకున్న ఆ పా ర్టీకి టీఆర్‌ఎస్ షాక్ ఇ చ్చింది. టీఆర్‌ఎస్ ఎంఐఎం పార్టీల పొత్తు ఖరారు అయిన నేపథ్యంలో మహారాష్ట్రలో మేయర్ అభ్యర్థి కాపర్తి సుజాత ఆధ్వర్యంలో విహారయాత్రకు వెళ్లిన వా రిని తక్షణమే నిజామాబాద్‌కు రావాల్సిందిగా పార్టీనుంచి ఆదేశాలు వెళ్లటంతో కార్పొరేటర్లు మంగళవారం తెల్లవారుజామున నిజామాబాద్‌కు చేరుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ పదవిని దక్కించుకునేందు కు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటంతో పార్టీ నాయకు లు, కార్యకర్తలు డీలా పడిపోయారు.
 
  నగరంలో 2004లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచింది. అనంత రం 2005లో కార్పొరేషన్ ఎన్నికల్లో 31 స్థానాలు గెలుచుకుని మేయర్ ప దవిని కైవసం చేసుకుంది. ఇలా 200 4 నుంచి 2010 వరకు నగరంలో కాం గ్రెస్ పార్టీ తన అధిపత్యాన్ని కొనసాగించింది. ఇప్పుడు నగరంలో కాంగ్రె స్ పార్టీ ఏవిధంగా ముందుకు వెళ్తుం దోనని ప్రజలు అసక్తిగా చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement