నామినేషన్‌కొచ్చారా... డబ్బు తీసుకోండి.. | came for Nominations...Take the money .. | Sakshi
Sakshi News home page

నామినేషన్‌కొచ్చారా... డబ్బు తీసుకోండి..

Apr 18 2014 3:22 AM | Updated on Aug 14 2018 4:21 PM

పుట్టా సుధాకర్ యాదవ్ నామినేషన్‌కు వచ్చారా.. అయితే డబ్బులు తీసుకోండీ.. అంటూ మైదుకూరు మండలం గంజికుంటకు చెందిన కేవీఆర్ అనే టీడీపీ నాయకుడు గురువారం మధ్యాహ్నం డబ్బులు పంపీణీ చేశారు.

పుట్టా సుధాకర్ యాదవ్ నామినేషన్‌కు వచ్చారా.. అయితే డబ్బులు తీసుకోండీ.. అంటూ మైదుకూరు మండలం గంజికుంటకు చెందిన కేవీఆర్ అనే టీడీపీ నాయకుడు గురువారం మధ్యాహ్నం డబ్బులు పంపీణీ చేశారు. మైదుకూరు నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి అయిన పుట్టా సుధాకర్‌యాదవ్ గురువారం మధ్యాహ్నం భారీ జన సమీకరణ నడుమ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం ఈ కార్యక్రమానికి ఆయా గ్రామాల నుంచి వచ్చిన వారందరికీ టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులందరూ తలో వంద రూపాయలు నగదు చేతిలో పెట్టారు.
 
 మద్యం కావాలంటే వనిపెంట రోడ్డుకెళ్లండంటూ చెప్పారు.  మైదుకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, పోలీసుస్టేషన్, జెడ్పీహైస్కూలు ఇలా పలుచోట్ల నామినేషన్‌కు హాజరైన వారందరికీ వంద రూపాయల చొప్పున డబ్బులను పంచిపెట్టారు. కేవీఆర్   ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రోడ్డుపై కారు ఆపి అందులో నుంచే డబ్బులను పంచారు. ఈ దృశ్యాలను ‘న్యూస్‌లైన్’ క్లిక్‌మన్పించటంతో అక్కడి నుంచి మకాం మరో చోటికి మార్చారు. ఇలాంటి సంఘటనలు మైదుకూరు పట్టణంలో పలు చోట్ల జరిగాయి.  

Advertisement
 
Advertisement
Advertisement