
బఫూన్ ఘనవిజయం
రాజకీయ నాయకులను ఎద్దేవా చేసేందుకు వారిని బఫూన్లుగా అభివర్ణించడం కద్దు. బ్రెజిల్ రాజకీయ చరిత్రలో ఒక బఫూన్ సంచలనం సృష్టించాడు.
రాజకీయ నాయకులను ఎద్దేవా చేసేందుకు వారిని బఫూన్లుగా అభివర్ణించడం కద్దు. బ్రెజిల్ రాజకీయ చరిత్రలో ఒక బఫూన్ సంచలనం సృష్టించాడు. ‘గ్రంపీ ది క్లౌన్’ అనే బఫూన్‌కు పార్లమెంటులో ఎంపీలంతా ఏం చేస్తారోననే కుతూహలం పుట్టింది. అంతే, 2010 ఎన్నికల్లో బరిలోకి దూకాడు. రాజకీయ నేతలైన మిగిలిన అభ్యర్థులంతా ఓటర్లను ఇవి చేస్తాం, అవి చేస్తాం అంటూ హామీలతో ఊదరగొడితే, గ్రంపీ మాత్రం తాను అసలేమీ చేయాలనుకోవడం లేదని ఓటర్లకు నిజాయితీగా చెప్పేశాడు. పార్లమెంటులో ఎంపీలంతా ఏం చేస్తారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. బ్రెజిల్ ఓటర్లకు అతడి నిజాయితీ నచ్చినట్లుంది. ఘన విజయం కట్టబెట్టారు. అతడి సమీప ప్రత్యర్థికి లభించిన ఓట్లకు రెట్టింపు కంటే ఎక్కువగా, గ్రంపీకి ఏకంగా 13 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి.