ఆశీర్వదించారు.. అందల మెక్కుతున్నారు | bjp josh in elections | Sakshi
Sakshi News home page

ఆశీర్వదించారు.. అందల మెక్కుతున్నారు

May 21 2014 2:08 AM | Updated on Mar 29 2019 9:24 PM

ఆశీర్వదించారు.. అందల మెక్కుతున్నారు - Sakshi

ఆశీర్వదించారు.. అందల మెక్కుతున్నారు

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి దేశవ్యాప్తంగా ప్రచార సభలను నిర్వహించారు.

 వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి దేశవ్యాప్తంగా ప్రచార సభలను నిర్వహించారు. ఇందులో భాగంగా గత నెల 22 వ తేదీన నగరంలోని గిరిరాజ్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభకు ముఖ్యఅతిథిగా ఆయన వచ్చారు. ఈ సభకు బంజారాల గురువు రామారావు మహారాజ్ మహారాష్ట్ర నుంచి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభావేదికపై నరేంద్రమోడీకి మహారాజ్ ‘విజయోస్తూ’ అంటూ ఆశీర్వదిం చారు.
 
దేశంలో మోడీని ప్రధానిగా చూడాలని కాంక్షించిన నేపథ్యంలో ఇందూరు గడ్డపై మహారాష్ట్ర మహారాజ్ ఆశీర్వదం ఎంతగానో తోడైందని  బంజారవర్గాలు చెప్పుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనంతో బీజేపీకి దేశప్రజలు అఖండ మెజారిటీని అందించారు. దీంతో ఆయన  నవభారత నిర్మాణానికి పూనుకునేందకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 26న సాయంత్రం 6 గంటలకు  ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement