అభిమానులు నేను సీఎం కావాలనుకుంటున్నారు | balakrishna comments | Sakshi
Sakshi News home page

అభిమానులు నేను సీఎం కావాలనుకుంటున్నారు

Apr 2 2014 1:02 AM | Updated on Aug 29 2018 1:59 PM

అభిమానులు నేను సీఎం కావాలనుకుంటున్నారు - Sakshi

అభిమానులు నేను సీఎం కావాలనుకుంటున్నారు

విజయవాడ: తాను సీఎం కావాలని తన అభిమానులు కోరుకుంటున్నారని సినీ నటుడు బాలకృష్ణ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని అన్నారు.

సినీ నటుడు బాలకృష్ణ వెల్లడి


 సాక్షి, రాజమండ్రి/ విజయవాడ: తాను సీఎం కావాలని తన అభిమానులు కోరుకుంటున్నారని సినీ నటుడు బాలకృష్ణ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని అన్నారు. ఇటీవలి తన సినిమా ‘లెజెండ్’ విజయయూత్రలో భాగంగా మంగళవారం ఆయన రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ‘లెజెండ్’ విజయూనందంలో ఉన్నాన న్నారు. తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదంటూనే.. ఎమ్మెల్యేగా ఎక్కడినుంచి పోటీ చేయూలనే విషయం ఇక్కణ్ణుంచి వెళ్లాక తన బావ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా? లేక ఎంపీగా పోటీ చేయాలా? అనే అంశం చంద్రబాబు నిర్ణయిస్తారని బాలకృష్ణ తెలిపారు.

 

తాను ఎక్కడ పోటీ చేసినా, ఏ పదవికి పోటీ చేసినా అభిమానులు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలన్నారు. బాలకృష్ణ రాజమండ్రి వస్తున్నారని ముందుగానే తెలిసినా.. ఇటు విజయోత్సవ ర్యాలీలో కానీ మరెక్కడా టీడీపీ నాయకులెవరూ కనిపించలేదు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పరిమి వాసు మినహా తెలుగు తమ్ముళ్ళు దూరంగా ఉన్నారు.

 


 

Advertisement
 
Advertisement
Advertisement