'వాళ్ల డబ్బు తీసుకోండి.. మాకు ఓటేయండి' | arvind kejriwal asks voters to accept money | Sakshi
Sakshi News home page

'వాళ్ల డబ్బు తీసుకోండి.. మాకు ఓటేయండి'

Apr 22 2014 9:34 AM | Updated on Aug 14 2018 4:21 PM

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరుక్కున్నారు. రాజకీయ పార్టీలన్నీ ఇస్తున్న డబ్బులు తీసుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరుక్కున్నారు. రాజకీయ పార్టీలన్నీ ఇస్తున్న డబ్బులు తీసుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. అయితే వాళ్ల డబ్బు తీసుకుని, చివరకు తనకు ఓటేయాలని కోరారు. అమేథీ నియోజకవర్గ పరిధిలోని రాణీగంజ్ ప్రాంతం శుక్లా బజారులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

'ఎన్నికలు వచ్చేశాయి. వాళ్లంతా మీకు డబ్బు ఇస్తామంటారు. అదంతా మీరు కష్టపడి సంపాదిస్తే, వాళ్లు 2జీ, కామన్వెల్త్ స్కాముల్లో దోచుకున్నదే. అందుకని తీసుకోండి. వాళ్లిచ్చే చీరలు, దుప్పట్లు కూడా తీసుకోండి. కానీ, వాళ్లకు మాత్రం ఓటేయద్దు.. చీపురు గుర్తుకే ఓటేయండి' అని కేజ్రీవాల్ ఓటర్లకు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement