అధికారంలోకి రాగానే నగరానికి 5వేల ఇళ్లు | 5 thousand houses to town says kalvakuntla chandrashekar rao | Sakshi
Sakshi News home page

అధికారంలోకి రాగానే నగరానికి 5వేల ఇళ్లు

Apr 29 2014 2:03 AM | Updated on Aug 15 2018 9:06 PM

అధికారంలోకి రాగానే నగరానికి 5వేల ఇళ్లు - Sakshi

అధికారంలోకి రాగానే నగరానికి 5వేల ఇళ్లు

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిజామాబాద్ నగరానికి మొదటి విడతలో ఐదు వేల ఇళ్లు మంజూరు చేస్తానని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు.

నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్:  టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిజామాబాద్ నగరానికి మొదటి విడతలో ఐదు వేల ఇళ్లు మంజూరు చేస్తానని  ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గ్రౌండ్‌లో నిర్వహిం చిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ పట్టణాల్లోనూ పేదలకు ఇళ్లు కట్టిస్తానన్నారు. రూ. 4 లక్షలతో ప్లాట్లను కేటాయించి వంద శాతం సబ్సిడీతో ఇళ్లు కట్టుకోవచ్చునని అన్నా రు. ఇందుకు మొదటి విడతగా నగరానికి 5 వేల ఇళ్లు మంజూరు చేస్తానన్నారు. గతంలో రాజీవ్ గృహకల్ప కింద నిర్మించిన ఇళ్లు ఏమాత్రం సౌకర్యవంతంగా లేవని, ఇరుకు గదు లతో ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు.

 నిజామాబాద్ నగరం సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతోందన్నారు.  ఇక్కడి నాయకులు దొడ్డుగా, బలంగా ఉన్నప్పటికీ అభివృద్ధి ఏమీ లేదంటూ విమర్శించారు.  అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఒక్క పార్క్ లేదు. ఉన్న తిలక్‌గార్డెన్‌లో భవనాలు కట్టేశారన్నారు. నగరంలో అన్నీ సమస్యలే ఉన్నాయి. జిల్లాలోను బీడీ కార్మికులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మూడవ నెల నుంచే ప్రతి ఒక్కరికి ప్రతి నెల రూ. 1,000 భృతి అందిస్తామన్నారు. అంతేకాకుండా బీడీ కార్మికుల కోసం బీడీ భవన్‌ను నిర్మిస్తామన్నారు.

 గతంలో ఇంటి రుణాలు తీసుకున్నవారికి మాఫీ చేస్తాం, తండాలను పంచాయతీలుగా మారుస్తాం, గిరిజనులు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చా రు. అలాగే వృద్ధులకు, వితంతువులకు రూ. 1,000 పింఛన్, వికలాంగులకు రూ. 1,500 పింఛన్ అందిస్తామన్నారు. ఇందుకుగాను టీఆర్‌ఎస్‌కు శాసన సభా స్థానాలతో పాటు, 16 ఎంపీ సీట్లు అందించాలని ప్రజలను కోరారు. తెలంగాణకు రక్షణ కవచం, స్వీయరక్షణ అవసరమని మేధావులు, కార్మికులు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు అందరు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. సకల జనుల సమ్మెకు ఎలా పూర్తి మద్దతు ఇచ్చారో అలాగే టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చి తమను గెలిపించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement