28 నుంచి 30 తేదీ వరకు మద్యం షాపులు బంద్ | 28 from 30 to Alcohol shops Bandh | Sakshi
Sakshi News home page

28 నుంచి 30 తేదీ వరకు మద్యం షాపులు బంద్

Apr 27 2014 4:19 AM | Updated on Aug 17 2018 7:44 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈనెల 28 తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు బంద్ ఉంటాయని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కె.మహేష్‌బాబు తెలిపారు.

ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈనెల 28 తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు బంద్ ఉంటాయని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కె.మహేష్‌బాబు తెలిపారు. జిల్లాలోని 156 మద్యం దుకాణాలు, 44 బార్ అండ్ రెస్టారెంట్లు, 3 క్లబ్బులు బంద్ ఉంటాయన్నారు.  ఎన్నికల నేపథ్యంలో  ఇప్పటి వరకు 2,014 కేసుల్లో 1,353 మందిని అరెస్టు చేశామని తెలిపారు.

 

  21,657 లీటర్ల సారా, 4,41,560 లీటర్ల బెల్లం పానకం, 3, 560 క్వింటాల బెల్లం, 441.86 లీటర్ల ఐఎంఎల్ లిక్కర్  స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.  60 వాహనాలు సీజ్ చేశామన్నారు. 115 మందిని బైండోవర్ చేశామని తెలిపారు.  జిల్లా సరిహద్దుల్లో 13 చెక్‌పోస్టుల్లో ఎక్సైజ్, పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement