2014 కామన్‌వెల్త్ క్రీడలను ఏ దేశంలో నిర్వహించారు?
	 1.    2014 కామన్‌వెల్త్ క్రీడలను ఏ దేశంలో నిర్వహించారు?
	     1) ఆస్ట్రేలియా    2) కెనడా
	     3) దక్షిణాఫ్రికా    4) స్కాట్లాండ్
	 
	 2.    అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎంత మంది న్యాయమూర్తులు ఉంటారు?
	     1) 10    2) 15    3) 30    4) 25
	 
	 3.    రెడ్‌క్రాస్ సంస్థను ఎవరు ప్రారంభించారు?
	     1) హెన్రీ డ్యునాంట్ 2) పీటర్ బెన్సన్
	     3) ఐసన్ హోవర్    4) మదర్ థెరిసా
	 
	 4.    ‘యాన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్’ పుస్తక  రచయిత ఎవరు?
	     1) రవీంద్రనాథ్ ఠాగూర్
	     2) అరబిందో ఘోష్
	     3) బాలగంగాధర్ తిలక్
	     4) సర్వేపల్లి రాధాకృష్ణన్
	 
	 5.    శిలీంద్రాల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
	     1) ఫైకాలజీ    2) మైకాలజీ
	     3) కాంకాలజీ    4) టాక్సికాలజీ
	 
	 6.    ‘హిరోషిమా డే’ను ఏ తేదీన నిర్వహిస్తారు?
	     1) ఆగస్ట్ - 6    2) ఆగస్ట్ - 8
	     3) ఆగస్ట్ - 9    4) ఆగస్ట్ - 12
	 
	 7.    {పపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
	     1) న్యూయార్‌క    2) రోమ్
	     3) వియన్నా    4) జెనీవా
	 
	 8.    కిందివాటిలో మిలిటరీ కూటమి ఏది?
	     1) కామన్‌వెల్త్   2) అలీనోద్యమ కూటమి
	     3) నాటో    4) జీ - 8
	 
	 9.    కిందివాటిలో ద్రాక్షతోటల పెంపకానికి సంబంధించింది?
	     1) ఎపికల్చర్    2) వర్మికల్చర్
	     3) సెరికల్చర్    4) విటికల్చర్
	 
	 10.    కిందివాటిలో సబ్‌సోనిక్ క్షిపణి ఏది?
	     1) నిర్భయ్    2) బ్రహ్మోస్
	     3) శౌర్య    4) అస్త్ర
	 
	 11.    రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి
	     పొందిన భారతీయుడెవరు?
	     1) సి.వి. రామన్
	     2) హరగోవింద్ ఖురానా
	     3) వెంకట్రామన్ రామకృష్ణన్
	     4) ఏదీకాదు
	 
	 12.    దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2013లో ఎవరికి లభించింది?
	     1) ప్రాణ్        2) వి.కె. మూర్తి
	     3) డి. రామానాయుడు 4) గుల్జార్
	 
	 13.    2015 జూలైలో బ్రిక్స్ ఏడో సదస్సును ఏ దేశంలో నిర్వహించనున్నారు?
	     1) బ్రెజిల్    2) ఇండియా
	     3) రష్యా    4) చైనా
	 
	 14.    కీవ్ అనేది ఏ దేశ రాజధాని నగరం?
	     1) సెర్బియా        2) సిరియా
	     3) క్రొయేషియా    4) ఉక్రెయిన్
	 
	 15.    2014లో జరిగిన ఏ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సానియా మీర్జా మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ సాధించింది?
	     1) ఆస్ట్రేలియన్ ఓపెన్ 2) వింబుల్డన్
	     3) యూఎస్ ఓపెన్      4) ఏదీకాదు
	 
	 16.    విజయ్ హజారే ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది?
	     1) హాకీ    2) క్రికెట్
	     3) టెన్నిస్    4) టేబుల్ టెన్నిస్
	 
	 17.    సెంట్రల్ రైస్ రీసెర్‌చ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడ
	     ఉంది?
	     1) కటక్    2) హైదరాబాద్
	     3) నాగ్‌పూర్    4) కోల్‌కతా
	 
	 18.    కిలిమంజారో పర్వత శిఖరం ఏ ఖండంలో
	     ఉంది?
	     1) ఆసియా        2) ఆఫ్రికా
	     3) దక్షిణ అమెరికా    4) ఉత్తర అమెరికా
	 
	 19.    కింద పేర్కొన్నవారిలో రెండుసార్లు రాష్ట్రపతిగా పనిచేసిందెవరు?
	     1) సర్వేపల్లి రాధాకృష్ణన్
	     2) జాకీర్ హుస్సేన్         3) వి.వి. గిరి
	     4) బాబూ రాజేంద్రప్రసాద్
	 
	 20.    ఆరుగురు మిత్రుల్లో ఐదుగురి సరాసరి ఖర్చు *40. ఆరో వ్యక్తి ఖర్చు ఆరుగురి మిత్రుల సరాసరి ఖర్చు కంటే *50 ఎక్కువ. అయితే ఆరుగురి మిత్రుల మొత్తం ఖర్చు ఎంత?
	     1) * 290     2) * 300
	     3) * 310     4) * 400
	 
	 21.    ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే 40 శాతం మార్కులు రావాలి. ఒక విద్యార్థికి  200 మార్కులు రావడం వల్ల 40 మార్కు లతో ఫెయిల్ అయ్యాడు. అయితే పరీక్షను మొత్తం ఎన్ని మార్కులకు నిర్వహించారు?
	     1) 400    2) 500
	     3) 600    4) కనుగొనలేం
	 
	 22.    రెండు సంఖ్యల నిష్పత్తి 3:4. వాటి గ.సా.భా. 6. వాటి క.సా.గు. ఎంత?
	     1) 1    2) 12    3) 48    4) 72
	 
	 23.    తండ్రి ప్రస్తుత వయసు కొడుకు వయసుకు 5 రెట్లు. మూడేళ్ల కిందట తండ్రి వయసు కొడుకు వయసుకు 7 రెట్లు. అయితే తండ్రి ప్రస్తుత వయసెంత?
	     1) 45 ఏళ్లు    2) 42 ఏళ్లు
	     3) 40 ఏళ్లు    4) 55 ఏళ్లు
	 
	 24.    అ ఒక పనిని 12 రోజుల్లో ఆ అదేపనిని 16 రోజుల్లో పూర్తి చేస్తారు. వారిద్దరూ కలిసి పని ప్రారంభించిన 6 రోజుల తర్వాత అ తప్పుకున్నాడు. మిగిలిన పనిని ఆ ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు?
	     1) 1     2) 2    3) 4    4) 8
	 
	 25.    250 మీ. పొడవున్న రైలు 90 కి.మీ./గం. వేగంతో ప్రయాణిస్తోంది. అది 150 మీ. పొడవున్న ప్లాట్‌ఫారంను ఎంత సమ యంలో దాటుతుంది?
	     1) 8 సెకన్లు    2) 10 సెకన్లు
	     3) 12 సెకన్లు    4) 16 సెకన్లు
	 
	 26.    ఒక వ్యక్తి వస్తువులను కొన్నధరకే అమ్ము తున్నాడు. కానీ తూకం కిలోగ్రాముకు బదు లుగా 800 గ్రాముల సరుకునే ఇస్తున్నాడు. అయితే అతడికి ఎంత శాతం లాభం వస్తుంది?
	     1) 20    2) 25    3) 162/3    4) 121/4    
	 
	 27.    అ, ఆ, ఇలు వరుసగా *40,000, *50,000, *60,000ల పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ సంవత్స రం చివరన వారికి * 45,000 లాభం వస్తే అందులో అ వాటా ఎంత?
	     1) * 12,000    2) * 16,000
	     3) * 24,000    4) * 28,000
	 
	 28.    *2,000 అసలు.. సంవత్సరానికి 10 శాతం చక్రవడ్డీ ప్రకారం ఎన్ని సంవత్సరాల్లో
	 * 2662ల మొత్తం అవుతుంది?
	     1) 4    2) 3    3) 2    4) 1
	 
	 29.    ఒక పడవ 160 కి.మీ. దూరాన్ని ప్రవా హదిశలో 2 గంటలు, ప్రవాహానికి వ్యతిరేక దిశలో 4 గంటలు ప్రయాణించింది. నిలకడ నీటిలో పడవ వేగం ఎంత?
	     1) 20 కి.మీ./గం.    2) 30 కి.మీ./గం.
	     3) 40 కి.మీ./గం.    4) 60 కి.మీ./గం.
	 
	 30.    నలుగురు వ్యక్తుల బృందంలో 60 కి.గ్రా. బరువున్న ఒక వ్యక్తి బయటకు వెళ్లి, అతడి స్థానంలో కొత్త వ్యక్తి వచ్చాడు. దీంతో వారి సరాసరి బరువు 2కి.గ్రా. పెరిగింది. అయితే కొత్తగా వచ్చిన వ్యక్తి బరువెంత?
	     1) 60 కి.గ్రా.    2) 62 కి.గ్రా.
	     3) 66 కి.గ్రా.    4) 68 కి.గ్రా.
	 
	 31.    ఒక చతురస్ర వైశాల్యం 6050 చ.మీ. దాని కర్ణం పొడవు ఎంత?
	     1) 98.99 మీ.    2) 110 మీ.
	     3) 116 మీ.    4) చెప్పలేం
	 
	 32.    28 ÷ 4+ 5 *2 – 7= ?
	     1) 0.78    2) 2    3) 10    4) 12
	 
	 33.    16 *15 ÷4 + 7 – 5 = ?
	     1) 62    2) 36    3) 54    4) 24.25
	 
	 34.    A, B, D, G, K,?
	     1) M    2) N    3) O    4) P
	 35.    అ ఒక పనిని 3 రోజుల్లో, ఆ  అదే పనిని 2 రోజుల్లో పూర్తి చేయగలరు. వారిద్దరూ కలిసి ఆ పనిని పూర్తిచేయడం వల్ల వారికి * 500 వస్తే అందులో అ వాటా ఎంత?
	     1) * 200    2) * 250
	     3) * 300    4) చెప్పలేం
	 
	 36.    రెండు సంఖ్యల క.సా.గు. 64. అయితే కిందివాటిలో ఆ రెండు సంఖ్యల గ.సా.భా. ఏది కాకపోవచ్చు?
	     1) 4    2) 8    3) 12    4) 16
	 
	 37.    10 వస్తువుల కొన్నవెల, 8 వస్తువుల అమ్మిన వెలకు సమానం. అయితే ఎంత శాతం లాభం/నష్టం వస్తుంది?
	     1) 20 % లాభం    2) 25 % లాభం
	     3) 20 % నష్టం    4) 25 % నష్టం
	 
	 38.    ఒక పట్టణ ప్రస్తుత జనాభా 40,000. ఏటా 5 శాతం జనాభా పెరిగితే రెండేళ్ల తర్వాత ఆ పట్టణ జనాభా ఎంత?
	     1) 44,100    2) 44000
	     3) 42000    4) 41400
	 
	 39.    ఒక వృత్తం వైశాల్యం 616 చ.మీ. దాని చుట్టుకొలత ఎంత?
	     1) 44 మీ.    2) 88 మీ.
	     3) 96 మీ.    4) 172 మీ.
	 
	 40.    అతి పెద్ద పుష్పం ఏది?
	     1) లిమ్నా    2) ఉల్ఫియా
	     3) రఫ్లీషియా    4) అరటి
	 
	 41.    ఫర్నీచర్‌ను తయారు చేసేందుకు ఉపయో గించే గడ్డి జాతి?
	     1) వరి            2) గోధుమ
	     3) మొక్కజొన్న    4) వెదురు
	 
	 42.    జంతు రాజ్యంలో అతి పెద్ద వర్గం (ఫైలా)?
	     1) మొలస్కా    2) ఆర్థ్రోపొడా
	     3) అనిలిడా    4) సరీసృపాలు
	 
	 43.    ఒక వ్యక్తి రక్తంలో యాంటీజెన్‌స ఆ, యాంటీ బాడీస్ అ ఉన్నట్లయితే, అది ఏ రక్త వర్గం?
	     1) A    2) O    3) B    4) AB
	 
	 44.    ఆకుకూరలను ఎక్కువగా ఉడికిస్తే
	     కోల్పోయే విటమిన్?
	     1) విటమిన్-B1
	     2) ఫాంటోథినిక్ ఆమ్లం
	     3) C        4) ఫోలిక్ ఆమ్లం
	 
	 45.    గుడ్లు పెట్టి పాలిచ్చే జీవి?
	     1) ప్లాటిపస్    2) కంగారు
	     3) పెంగ్విన్    4) ఒరంగుటాన్
	 
	 46.    కపాలంలో ఉండే ఎముకల సంఖ్య?
	     1) 14    2) 206      3) 8    4) 22
	 
	 47.    మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి?
	     1) పిట్యూటరీ    2) కాలేయం
	     3) అధివృక్క    4) గోనాడ్‌స
	 
	 48.    మానవుడు ప్రతి నిమిషానికి ఎన్నిసార్లు  శ్వాసిస్తాడు?
	     1) 10    2) 32    3) 18    4) 26
	 
	 49.    పక్షులు ఎగరడానికి తోడ్పడే అంశం?
	     1) వాయు పూరిత ఎముకలు
	      2) ఉడ్డయక కండరాలు
	     3) దేహ నిర్మాణం    4) 1, 2
	 
	 50.    నీలిమందు దేని నుంచి లభిస్తుంది?
	     1) ఇండిగో ఫెరా    2) సింఖోనా
	     3) క్రిసాంథియం    4) కలమంద
	 
	 51.    కిందివాటిలో పశ్చిమం వైపునకు ప్రవహిం చని నది?
	     1) నర్మదా    2) సబర్మతి
	     3) మహానది    4) తపతి
	 
	 52.    ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ’
	     ఎక్కడ ఉంది?
	     1) డెహ్రాడూన్    2) కోల్‌కతా
	     3) ముంబయి    4) పనాజీ
	 
	 53.    భారతదేశంలో నైరుతి రుతుపవనాలు ఏ తీర ప్రాంతంలో ముందుగా ప్రవేశిస్తాయి?
	     1) కొంకణ్ తీరం       2) సర్కార్ తీరం
	     3) కోరమాండల్ తీరం 4) మలబార్ తీరం
	 
	 54.    భారతదేశంలో మొదటిదైన ‘శివసముద్రం’ జల విద్యుత్  కేంద్రం ఏ నదిపై ఉంది?
	     1) శరావతి    2) కావేరి
	     3) మహానది    4) తపతి
	 
	 55.    సూర్యుడు, భూమికి మధ్య దూరం
	     గరిష్టంగా ఉండే రోజు?
	     1) జూలై 4    2) జనవరి 20
	     3) సెప్టెంబర్ 22    4) డిసెంబర్ 22
	 
	 56.    ఆర్థ్రత     (ఏఠఝజీఛీజ్టీడ)ను కొలిచే పరికరం?
	     1) భారమితి    2) థర్మామీటర్
	     3) హైగ్రోమీటర్     4) హైడ్రోమీటర్
	 
	 57.    భారతదేశంలో మొదటి సిమెంట్ కర్మాగా రాన్ని 1904లో ఎక్కడ నిర్మించారు?
	     1) కోల్‌కతా    2) ముంబయి
	     3) సూరత్     4) చెన్నై
	 
	 58.    రోజ్‌వుడ్, ఎబోని, మహాగని లాంటి
	     వృక్షాలు ఏ అడవుల్లో పెరుగుతాయి?
	     1) ఉష్ణమండల ఆకురాల్చే అడవులు     2) ఉష్ణమండల సతత హరిత అడవులు
	     3) మధ్యధరా అడవులు
	     4) శృంగాకార అడవులు
	 
	 59.    భారతదేశంలోని పాత ఒండ్రు నేలలను ఏమని పిలుస్తారు?
	     1) భంగర్    2) ఖాదర్
	     3) బాబర్    4) టెరాయ్
	 
	 60.    ‘గొప్ప జనాభా విభాజక సంవత్సరం’ ఏది?
	     1) 1933     2) 1921     
	     3) 1936     4) 1951
	 
	 61.    ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’ అని ఏ ప్రాంతా న్ని పిలుస్తారు?
	     1) కావేరి డెల్టా ప్రాంతం
	     2) మహానది డెల్టా ప్రాంతం
	     3) సువర్ణ రేఖా డెల్టా ప్రాంతం
	     4) కృష్ణా - గోదావరి డెల్టా ప్రాంతం
	 
	 62.    భారతదేశ మొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏది?
	     1) శ్రీహరికోట    2) తుంబ
	     3) త్రివేండ్రం        4) బెంగళూరు
	 
	 63.    రాజస్థాన్‌లోని ‘ఖేత్రి’ గనులు ఏ ఖనిజానికి ప్రసిద్ధి?
	     1) యురేనియం    2) అల్యూమినియం
	     3) రాగి        4) బంగారం
	 
	 64.    దేశంలో అతిపెద్ద జాతీయ రహదారి ఏది?
	     1) 1వ నెంబర్    2) 9వ నెంబర్
	     3) 5వ నెంబర్    4) 7వ నెంబర్
	 
	 65.    చంద్రకాంతి భూమిని చేరేందుకు పట్టే కాలం?
	     1) 8 నిమిషాలు    2) 4 నిమిషాలు
	     3) 24 గంటలు    4) 1.3 సెకన్లు
	 
	 66.    స్వదేశీ ఉద్యమం ఏ ఉద్యమంలో భాగంగా ప్రారంభమైంది?
	     1) శాసనోల్లంఘన ఉద్యమం
	     2) సహాయ నిరాకరణోద్యమం
	     3) వందేమాతర ఉద్యమం
	       4) క్విట్ ఇండియా ఉద్యమం
	 
	 67.    అద్వైతాన్ని ప్రచారం చేసిన భక్తి ఉద్యమ కారుడు?
	     1) రామానందుడు    2) శంకరాచార్యులు
	     3) రామానుజాచార్యులు
	     4) మధ్వాచార్యులు
	 
	 68.    ఏకశిలా దేవాలయాలను నిర్మించిన రాజ వంశం?
	     1) పల్లవులు        2) గుప్తులు
	     3) కాకతీయులు    4) శాతవాహనులు
	 
	 69.    రైత్వారీ పద్ధతిని మొదటగా ప్రవేశపెట్టిన వారెవరు?
	     1) అక్బర్    2) షేర్షా
	     3) అల్లావుద్దీన్ ఖిల్జీ     4) బాల్బన్
	 
	 70.    ‘మదర్’ పుస్తక రచయిత?
	     1) సరోజిని నాయుడు
	     2) మదర్ థెరిసా
	     3) మాక్సింగోర్కి
	      4) రవీంద్రనాథ్ ఠాగూర్
	 
	 71.    {పధానమంత్రి పదవికి కనీస అర్హతా వయసు ఎంత?
	     1) 21 ఏళ్లు    2) 25 ఏళ్లు
	     3) 30 ఏళ్లు    4) 35 ఏళ్లు
	 
	 72.    పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేవారు?
	     1) లోక్‌సభ స్పీకర్    2) రాజ్యసభ స్పీకర్
	     3) ప్రధానమంత్రి    4) రాష్ట్రపతి
	 
	 73.    రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే అధికారం గురించి ఏ రాజ్యాంగ ప్రకరణ లో పేర్కొన్నారు?
	     1) 352    2) 356    3) 360    4) 362
	 
	 74.    మూడంచెల గ్రామ పంచాయతీ వ్యవస్థను సూచించిన కమిటీ?
	     1) బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ
	     2) అశోక్ మెహతా కమిటీ
	     3) సర్కారియా కమిటీ  4) పైవన్నీ
	 
	 75.    సమాచార హక్కు చట్టాన్ని ఏ సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు?
	     1) 2005         2) 2006    
	     3) 2007        4) 2008
	 
	 76.    ‘యునెటైడ్ నేషన్‌స ఆర్గనైజేషన్ డే’ను ఏ రోజున నిర్వహిస్తారు?
	     1) జనవరి 24    2) డిసెంబర్ 24
	     3) అక్టోబర్ 24    4) మే 24
	 
	 77.    ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?
	     1) న్యూయార్‌క    2) వాషింగ్టన్
	     3) జెనీవా    4) టోక్యో
	 
	 78.    వ్యాట్ (VAT) అంటే?
	     1) విలువ ఆధారిత పన్ను
	     2) విలువతో కూడిన పన్ను
	     3) బ్యాంకు లావాదేవీలపై విధించే అద నపు రుసుం    
	     4) అమ్మకం పన్నుపై వేసే సర్‌చార్జీ
	 
	 79.    2011 జనాభా లెక్కల ప్రకారం పురుషుల కంటే స్త్రీలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మొదటిస్థానంలో ఉన్నదేది?
	     1) హర్యానా    2) కేరళ
	     3) మహారాష్ట్ర    4) కర్ణాటక
	 
	 80.    ఏ పన్ను ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూరుతుంది?
	     1) కార్పొరేషన్ పన్ను 2) ఆదాయ పన్ను
	     3) ఎక్సైజ్ పన్ను      4) కస్టమ్స్ పన్ను
	 
	 81.    {పస్తుతం అమల్లో ఉన్న (12వ) పంచవర్ష ప్రణాళిక కాలం?
	     1) 2007-12    2) 2009-14
	     3) 2010-15    4) 2012-17
	 
	 82.    NABARDపూర్తి రూపం?
	     1)    నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్
	     2)    నేషనల్ అసెస్‌మెంట్ బోర్‌డ ఫర్ అకడ మిక్ అండ్ రికన్‌స్ట్రక్షన్ డెవలప్‌మెంట్
	     3)    నేషనల్ అకడమిక్ బోర్‌డ ఫర్ అగ్రికల్చ రల్ రీసెర్‌చ డెవలప్‌మెంట్
	     4)    నేషనల్ అగ్రికల్చరల్ బ్యాంక్ ఫర్
	         అసెస్‌మెంట్ అండ్ రికన్‌స్ట్రక్షన్
	 
	 83.    డ్వాక్రా ప్రధాన లక్ష్యమేమిటి?
	     1)    స్త్రీలకు పావలా వడ్డీకి రుణాలు అందజేయడం
	     2)    మహిళా సాధికారత సాధించడం
	     3)    మహిళా గ్రూపులను ఏర్పాటు చేసి వారిలో ఐక్యతను పెంపొందించడం    
	     4)    మహిళల్లో నిరుద్యోగాన్ని నిర్మూ లించడం
	 
	 84.    భూమి సహజ ఉపగ్రహం?
	     1) బుధుడు    2) ఆర్యభట్ట
	     3) చంద్రుడు    4) పాలపుంత
	 
	 85.    బంగారం సాంద్రత (గ్రా/సెం.మీ3లలో)?
	     1) 8.9    2) 0.8    3) 13.6     4) 19.3
	 
	 86.    హైడ్రాలిక్ యంత్రాలు ఏ సూత్రం ఆధా రంగా పనిచేస్తాయి?
	     1) పాస్కల్     2) ఆర్కిమెడిస్     3) బాయిల్     4) బెర్నౌలీ సూత్రం
	 
	 87.    వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం?
	     1) ఆల్టీమీటర్    2) లాక్టోమీటర్
	     3) బారో మీటర్    4) హైగ్రోమీటర్
	 
	 88.    ఒక రోగి ఉష్ణోగ్రత 102°F. సెల్సియస్ మానంలో దీని విలువ ఎంత?
	     1) 42.3 °C    2) 38.8 °C
	     3) 36.8 °C    4) 43.2 °C
	 
	 89.    తిర్యక్ తరంగాలకు ఉదాహరణ?
	     1) తీగలపై ఏర్పడే తరంగాలు
	     2) కాంతి తరంగాలు
	     3) ధ్వని తరంగాలు           4) 1, 2
	 
	 90.    ఈఎన్‌టీ వైద్యులు ఏ రకమైన దర్పణాలను ఉపయోగిస్తారు?
	     1) కుంభాకార    2) పుటాకార
	     3) సమతల     4) వాలు దర్పణాలు
	 
	 91.    కిందివాటిలో భిన్నమైనదాన్ని గుర్తించండి.
	     1) క్రోమియం    2) కోబాల్ట్
	     3) నికెల్    4) ఉక్కు
	 
	 92.    టెలిఫోన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త?
	     1) మార్కోని    2) గ్రాహంబెల్
	     3) బయర్‌డ    4) రాంట్‌జన్
	 
	 93.    న్యూక్లియర్ రియాక్టర్‌లో మితకారిగా దేన్ని ఉపయోగిస్తారు?
	     1) ఆల్కహాల్    2) భారజలం
	     3) బోరాన్    4) యురేనియం
	 
	 94.    తినే సోడా ఫార్ములా?
	     1) Na2CO3    2) Na2SO4
	     3) NaHCO3    4) NaOH
	 
	 95.    ఇసుక (సిలికా) అణుభారం?
	     1) 80     2) 40    3) 60    4) 100
	 
	 96.    {పొడ్యూసర్ వాయువు సంఘటనం?
	 1) CO + H2    2) CO + H2 + N2    3) CO + N2    4) ఏదీకాదు
	 
	 97.    కిందివాటిలో పాలీ శాకరైడ్?
	     1) గ్లూకోజ్    2) ఫ్రక్టోజ్
	     3) స్టార్‌చ    4) మాల్టోజ్
	 
	 98.    అత్యంత స్థిరమైన సల్ఫర్ రూపాంతరం?
	     1) రాంబిక్ సల్ఫర్    2) మోనోక్లినిక్
	     3) ప్లాస్టిక్    4) ఫ్లవర్ ఆఫ్ సల్ఫర్
	 
	 99.    స్పర్శా విధానంలో ఉత్ప్రేరకంగా వాడేది?
	     1) Ni    2) Fe    3) V2O5    4) Mo
	 
	 100. వేరు బొడిపెలు కలిగి నత్రజని స్థాపన చేయగలిగే మొక్క?
	     1) మొక్క జొన్న    2) చిక్కుడు
	     3) వరి         4) వెదురు

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
