తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది దాటిపోయింది. సాహిత్యరంగంలో రాష్ట్ర సాధనలో తెరవే పాత్ర చాలా కీలకమైనది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది దాటిపోయింది. సాహిత్యరంగంలో రాష్ట్ర సాధనలో తెరవే పాత్ర చాలా కీలకమైనది. ఏ రాజకీయ నాయకుల ప్రమేయం, పార్టీల ఛాయలు పడకుండా కేవలం ప్రజావాంఛకు అనుగుణంగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి చరి త్రను సృష్టించింది. ప్రజలను విస్మరించి కేవలం రాజకీయ పంథాయే ప్రధానంగా ఆలోచించే సంస్థల వలె కాకుండా నిత్యం సృజనాత్మకశక్తికి ఊతకర్రగా నిలవాలనేదే తెరవే లక్ష్యం. చరిత్ర, భాష, సంస్కృతి, మాట, రాత సాహిత్యాలు, వివిధ ప్రక్రియలలో ఎం తో కృషి జరగవలసిన తరుణం ఇది.
ప్రస్తుతం తెలం గాణలో నెలకొని ఉన్న సాహిత్య సాంస్కృతిక రం గంపై సమీక్షించుకుని భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకునే క్రమంలో హైదరాబాద్‌లో జూలై 12న ఒకరోజు సాహిత్య సదస్సును ఏర్పాటు చేశాం. తెరవే నూతన కార్యవర్గంతో పాటు అన్ని జిల్లాల కార్యవర్గాల కమిటీలను ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం.
ఆదివారం ఉదయం 10.30 నుంచి పగలు 1 గంట వరకు ‘వర్త మాన సాహిత్యం ధోరణులు కర్తవ్యాలు’ అనే అం శంపై జరిగే సదస్సులో ప్రముఖ సాహిత్యకారులు అల్లం నారాయణ, ఆచార్య వి.కృష్ణ, అంద్శై గోరటి వెంకన్న, జింబో, ఎం.వేదకుమార్, డా. మధుసూదన్ రెడ్డిలతోపాటు అన్ని జిల్లాల తెరవే అధ్యక్ష కార్యదర్శు లు పాల్గొంటారు. పగలు 2 గంటల నుంచి 5 గంటల వరకు దిశానిర్దేశం-కార్యక్రమాల రూపకల్పనపై జిల్లా కార్యవర్గ సభ్యులతో భేటీ ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు మీడియాతో సమావేశం జరుగుతుంది.
సదస్సు వేదిక: హైదరాబాద్ స్టడీ సర్కిల్, ఇందిరా పార్క్ సిగ్నల్ దగ్గర, దోమలగూడ.
- జయధీర్ తిరుమలరావు
రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రచయితల వేదిక, మొబైల్: 99519 42242