ఇదిగో పాము... వచ్చారో జాగ్రత్త | Farmer's new idea to protect coconut trees | Sakshi
Sakshi News home page

ఇదిగో పాము... వచ్చారో జాగ్రత్త

Jan 2 2018 10:31 AM | Updated on Mar 22 2019 1:41 PM

Farmer's new idea to protect coconut trees  - Sakshi

కొబ్బరిచెట్టుపై పాము బొమ్మ ,ఈ తోటలోని ప్రతిచెట్టుపైనా పాము బొమ్మలు

తూర్పుగోదావరి, అమలాపురం: కొబ్బరిచెట్టుపై పాము బొమ్మలు చూశారా? తోటలకు దిష్టి తగలకుండా వేసిన బొమ్మకాదు ఇది. కొబ్బరి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసే ఉడతలు. ఎలుకలు దాడి నుంచి కొబ్బరి చెట్టును..దిగుబడిని రక్షించుకునేందుకు రైతులు ఇలా పాము బొమ్మలను గీస్తున్నారు. సాధారణంగా ఎలుకలు, ఉడతలు కొట్టడంతో చెట్టు పలురకాలుగా ధ్వంసమవుతోంది. కొబ్బరి పిందెలను, చిన్నపాటి కాయలను సైతం ఇవి కొట్టేస్తుంటాయి. అలాగే డొలకలు, కొబ్బరి ఆకులు మొత్తాల్లో చేరి మొవ్వును తినేస్తాయి.

ఇలా చేయడం వల్ల కొబ్బరి చెట్టు కూడా దెబ్బతిన చనిపోయే ప్రమాదముంది. రైతులు వీటిని సకాలంలో గుర్తించకుంటే కొబ్బరితోట నాశనమవుతోంది. కొబ్బరితోట ఒక్కటే కాదు.. దాని అంతర పంటగా సాగు చేసే కోకో ఎలుక, ఉడతల దాడివల్ల ఎక్కువగా నష్టపోతోంది. దీంతో పాటు ఇతర అంతర పంటలకు కూడా నష్టం వాటిల్లితోంది. వీటిని నిర్మూలించాలంటే మట్టుబెట్టడం మిన హా మరో మార్గం లేదు. కానీ కొంతమందికి ఉడతను చంపడానికి సెంటిమెంట్‌ అడ్డువస్తోంది. ఇటువంటి రైతులు వాటిని భయపెట్టేందుకు, చెట్టు ఎక్కకుండా చేసేందుకు ఇలా పాము బొమ్మలను వేస్తున్నారు.

ఎలుక నివారణకు ఆల్యూమినియం రేకు మంచిది...
ఎలుకలు, ఉడతల నివారణకు పాము బొమ్మలు వేయడం మంచిదే. కానీ ఇది అన్నిసార్లు మంచి ఫలితాన్నివ్వదని అమలాపురానికి చెందిన ఆదర్శ రైతు అబ్బిరెడ్డి రంగబాబు తెలిపారు. కొబ్బరి, కోకో, ఇతర అంతర పంటపై సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన ఎలుకల నివారణ ‘సాక్షి’కి ఆయన తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే...

ఎలుకలు చాలా తెలివైనవి. ముఖ్యంగా చెట్లు ఎక్కే ఎలుకల జాతి రకాన్ని రేటస్‌..రేటస్‌ అంటారు. కొబ్బరి చెట్లపై పాము బొమ్మలుంన్నా ఎలుకలు చెట్టు ఎక్కడం మానవు. పాము బొమ్మలను ఒకటి, రెండుసార్లు చూపి భయపడి చెట్టు ఎక్కకున్నా, తరువాత అవి బొమ్మలని ఎలుకలు పసిగట్టగలవు. చెట్టు ఎక్కి యథావిధిగా ధ్వంసం చేస్తాయి. వీటి నిర్మూలనకు పలు పద్ధతులున్నాయి.
పుస్తకాలకు వేసే అట్టలు (ట్రాన్స్‌ప్లంట్‌ పేపర్‌)ని చెట్టుకు చుట్టాలి. కొబ్బరి చెట్టు కాండం గరుకుగా ఉండడం వల్ల ఎలుక ఎక్కేందుకు సలువుగా ఉంటుంది. కాబట్టి అట్ట పుస్తకాలకు వేసే అట్టలాంటి ట్రాన్స్‌పెంట్‌ పేపరును చుట్టడం మంచి ఫలితానిస్తోంది. దీనివల్ల ఎలుక, ఉడతలు కాళ్లు జారి కింద పడిపోతాయి.
ఆట్టలకు వేసే పేపరుకన్నా ఉత్తమమైన పద్ధతి అల్యూమినియం రేకులను తొడగడం. ఇలా చేయడం వల్ల కూడా ఎలుకలు జారిపడతాయి.
అల్యూమినయం రేకు, ప్లాస్టిక్‌ రేకుతో గరాటా ఆకారంలో చెట్టు మధ్యలో ఏర్పాటు చేయాలి. ఇలా చేయడం వల్ల అక్కడకు వెళ్లే ఎలుకలు, ఉడతలుపైకి వెళ్లేందుకు అవకాశముండదు.
గ్రీజులో మోనోక్రోటోఫాస్‌ మందును రాస్తే ఎలుక కాళ్లకు గ్రీజు అంటుకుంటుంది. దీన్ని నోటితో శుభ్రపరుచుకుంటాయి. అప్పుడు విషం నోటిలోకి వెళ్లి ఎలుక చనిపోతోంది.
చెట్టు దిగువ భాగంలో కొబ్బరి డొక్కల మధ్యలో ఎలుకల నివారణ ముందు ఉంచాలి. (ఫెర్మనెంట్‌ బైట్‌ స్టేషన్‌) ఎలుకలు చెట్టుమీదకు దిగినప్పుడు ఈ మందు తిని చనిపోతాయి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement