వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ‘సాయి’ | YSRCP STATE SECRETARY SAI | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ‘సాయి’

Jul 25 2016 11:40 PM | Updated on May 29 2018 4:26 PM

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ‘సాయి’ - Sakshi

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ‘సాయి’

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా గుత్తుల సాయి నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఈ నియామకం జరిగింది.

సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా గుత్తుల సాయి నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఈ నియామకం జరిగింది. ముమ్మిడివరం మండలం గాడిలంకకు చెందిన సాయి పార్టీలో ముమ్మిడివరం నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇంతవరకూ ఆ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా మాత్రమే ఉన్న సాయి సేవలను ఇక ముందు రాష్ట్రస్థాయిలో వినియోగించుకోవాలనుకుంటున్నారు. అదే ఉద్దేశంతో శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన సాయికి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. జగన్‌మోహన్‌రెడ్డి తనపై ఎంతో నమ్మకం ఉంచి అప్పగించిన రాష్ట్ర స్థాయి బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని సాయి ‘సాక్షి’కి చెప్పారు. నియోజకవర్గ నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement