పెద్దల కోసమే అలైన్మెంట్ మార్పు: వైఎస్ జగన్ | ysrcp president ys jaganmohan reddy krishna district tour | Sakshi
Sakshi News home page

పెద్దల కోసమే అలైన్మెంట్ మార్పు: వైఎస్ జగన్

Feb 15 2016 11:01 AM | Updated on Apr 4 2018 9:25 PM

పెద్దల కోసమే అలైన్మెంట్ మార్పు: వైఎస్ జగన్ - Sakshi

పెద్దల కోసమే అలైన్మెంట్ మార్పు: వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రాయానికి చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ నుంచి నూజివీడుకు బయలుదేరారు. మార్గం మధ్యలో రామవరప్పాడు బాధితులతో వైఎస్ జగన్ మాట్లాడారు. ఇన్నర్ రింగ్ రోడ్డు పనుల నిమిత్తం రైవస్ కాల్వకట్టపై ఇళ్లు తొలగించాలని రెవిన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి బాధలను వైఎస్ జగన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు పేదల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పెద్దల కోసం అలైన్మెంట్లు మార్చేసి పేదల ఇళ్లు తొలగించడం దారుణమన్నారు. రాజధాని నడిబొడ్డున అభివృద్ధి పేరుతో ఇళ్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఫ్లై ఓవర్ అనే బూచి చూపించి దారుణాలకు దిగుతున్నారని.. 50-60 సంవత్సరాలుగా ఉంటున్నవారిని వెళ్లగొడుతుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్పొరేటర్ హోటల్కు లాభం చేకూర్చడానికే అలైన్ మెంట్ మార్చారని ఆరోపించారు.

ఇప్పటికే 120 ఇళ్లు కూల్చారు. మరో 500 ఇళ్లు కూల్చడానికి సిద్ధమయ్యారని వైఎస్ జగన్ అన్నారు. పరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చాలనుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ఈ రూట్లో వెళ్తునప్పుడు గుడిసెలు కనిపించరాదని ఆదేశాలు జారీ చేశారన్నారు. పేదలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆయన బాధితులకు హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ వెంట జిల్లా ఎమ్మెల్యేలు, వైఎస్సార్ సీపీ నాయకులు ఉన్నారు. గన్నవరం విమానశ్రయంలో వైఎస్ జగన్కు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. నూజివీడు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సతీమణి సుజాతాదేవి పార్థివదేహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement