'బాబు బసచేస్తే అక్రమం సక్రమమైపోతుందా' | ysrcp mlc kolagatla veerabhadra swami slams cm chandrababu | Sakshi
Sakshi News home page

'బాబు బసచేస్తే అక్రమం సక్రమమైపోతుందా'

Mar 6 2016 4:31 PM | Updated on Aug 14 2018 11:26 AM

'బాబు బసచేస్తే అక్రమం సక్రమమైపోతుందా' - Sakshi

'బాబు బసచేస్తే అక్రమం సక్రమమైపోతుందా'

అక్రమ నిర్మాణమైన లింగమనేని గెస్ట్ హౌస్ లో చంద్రబాబు ఉంటున్నంత మాత్రాన అది సక్రమనిర్మాణం అవుతుందా? అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ప్రశ్నించారు.

హైదరాబాద్: ' మత్రులు, టీడీపీ నేతలు భూములు కొంటే తప్పేంట'న్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరణ..  భూములు కొల్లాగొట్టామని ఒప్పుకున్నట్లే ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.  లింగమనేని భూములు వద్దని చెప్పానన్న ముఖ్యమంత్రి పేదల భూములు మాత్రం ఎలా లాగేసుకుంటారని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో కోలగట్ల విలేకరులతో మాట్లాడారు.

రాజధాని ఎక్కడ పెడుతున్నారనే సమాచారం టీడీపీ నేతలకు లీక్ చేయడం వల్లే భూములు కొన్నారని, చంద్రబాబు అసలు రాజధాని కడుతున్నారా? భూ దోపిడీ చేస్తున్నారా? సమాధానం చెప్పాలని కోలగట్ల వీరభద్రస్వామి డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణమైన లింగమనేని గెస్ట్ హౌస్ లో చంద్రబాబు ఉంటున్నంత మాత్రాన అది సక్రమనిర్మాణం అవుతుందా? అని వ్యాఖ్యానించారు. బాబు దిగిపోతేనే జాబ్ వస్తుందని జనం అనుకుంటున్నారన్న కోలగట్ల, సీఎం వైఖరి వల్లే ఏపీలోని అన్ని జూట్ మిల్లులు మూతపడ్డాయని, వేలమంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement