చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు | ysrcp leaders take on chandra babu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు

Jun 5 2016 12:05 PM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రను టీడీపీ నాయకులు అడ్డుకోవాలనుకోవడం పిరికిపంద చర్య అని వైఎస్ఆర్ సీపీ నాయకులు అంజాద్ బాషా, సురేష్ బాబు, అమర్నాథ్ రెడ్డి విమర్శించారు.

కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రను టీడీపీ నాయకులు అడ్డుకోవాలనుకోవడం పిరికిపంద చర్య అని వైఎస్ఆర్ సీపీ నాయకులు అంజాద్ బాషా, సురేష్ బాబు, అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిని ప్రశ్నించినందుకు వైఎస్ జగన్పై అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలను అమలు చేయని చంద్రబాబుకు ప్రజలే బుద్ధిచెబుతారని అన్నారు. అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. రైతు భరోసా యాత్రకు జనం భారీగా తరలివస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement