పేదల నడ్డి విరిచిన టీఆర్‌ఎస్ : వైఎస్సార్సీపీ | YSRCP Leaders slams TRS Govt over electricity & RTC charges increasing | Sakshi
Sakshi News home page

పేదల నడ్డి విరిచిన టీఆర్‌ఎస్ : వైఎస్సార్సీపీ

Jun 29 2016 11:41 AM | Updated on Sep 5 2018 1:46 PM

టీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యుత్, బస్ చార్జీలను పెంచి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డివిరిచిందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ర్ట అధ్యక్షురాలు అమృతసాగర్ విమర్శించారు.

మహిళా విభాగం రాష్ర్ట  అధ్యక్షురాలు అమృతసాగర్
రంగారెడ్డి జిల్లా: టీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యుత్, బస్ చార్జీలను పెంచి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డివిరిచిందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ర్ట అధ్యక్షురాలు అమృతసాగర్ విమర్శించారు. మంగళవారం ఇబ్రహీంపట్నంలో ఎండీ ఖాలేద్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ధరలు పెంచుకుంటూ పోతే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విద్యుత్, బస్ చార్జీలను ఒక్క పైసాకూడా పెంచకుండా బంగారు పాలన అందించారని గుర్తు చేశారు. పెంచిన చార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
 
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
రాష్ర్టంలో వైఎస్సార్ సీపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని అమృతసాగర్ కోరారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలతో మమేకమై ఉద్యమించాలని సూచిం చారు. పార్టీ నూతన కమిటీలను త్వరలో నియమించనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాదగోని జంగయ్యగౌడ్, జిల్లా కార్యదర్శులుగా నల్ల ప్రభాకర్, ఎండీ.ఖాలేద్, యాచారం, మంచాల మండలాల అధ్యక్షులుగా పి.జయరాజ్, బుగ్గరాములు, ఇబ్రహీంపట్నం మండల విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా దూసారి వేణుప్రసాద్‌గౌడ్, మంచాల బీసీ సెల్ అధ్యక్షుడిగా భూర జంగయ్యగౌడ్‌ను నియమించాలని రాష్ట్ర అధిష్టానానికి ప్రతిపాదనలు పంపిం చినట్లు వివరించారు. నాయకులు డి.కుమార్‌గౌడ్, ఎల్. యాదగిరి, కె.సురేందర్‌రెడ్డి, ఎన్.మహేష్, టి.అబ్బాస్‌గౌడ్, కె.సతీష్, ఎస్‌కే జావిద్, ఆర్.రఘవీర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement