ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం నె రవేర్చలేదు.కాబట్టి వరంగల్ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో ప్రజలు భిన్నమైన తీర్పు ఇవ్వబోతున్నారు’’ అని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జోస్యం చెప్పారు.
♦ త్వరలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ప్రకటన
♦ ప్రజలు దీవిస్తారనే నమ్మకముంది
♦ తెలంగాణలోనే అధికంగా వైఎస్ సంక్షేమ కార్యక్రమాలు
♦ వరంగల్‌లో ఆయనకున్న ఆదరణే మాకు శ్రీరామరక్ష
♦ టీఆర్‌ఎస్ ఒక్క వాగ్దానాన్నీ నెరవేర్చలేదంటూ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం నె రవేర్చలేదు.కాబట్టి వరంగల్ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో ప్రజలు భిన్నమైన తీర్పు ఇవ్వబోతున్నారు’’ అని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జోస్యం చెప్పారు. రైతు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, దళితులకు మూడు ఎకరాలు, మైనారిటీలు,గిరిజనులకు 12 శా తం రిజర్వేషన్లు, మహిళలకు డ్వాక్రా రుణాల మాఫీ ... ఇలా టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఏ హామీ నిలుపుకోలేదని విమర్శించారు. మంగళవారం లోట స్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేం ద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ నేతలు ఎడ్మ కిష్టారెడ్డి, కె.శివకుమార్, నల్లా సూర్యప్రకాశ్, గట్టు శ్రీకాంత్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడా రు.
వరంగల్ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. పేదల హృదయాల్లో దేవుడిగా నిలిచిపోయిన మహా నేత వైఎస్సార్ ఆశయాల సాధనకు వైఎస్ జగన్‌మోహన్‌రె డ్డి స్థాపించిన పార్టీకి ప్రజల దీవెనలు తప్పకుండా లభిస్తాయన్నారు. టీ ఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ-బీజేపీతో తలపడి వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందనే విశ్వాసం తమకుందన్నారు. ఉప ఎన్నిక ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లు వస్తారన్నారు. ‘‘దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కట్టిన మొత్తం ఇళ్ల కంటే ఒక్క ఏపీలోనే ఎక్కువగా కట్టించిన ఘనత వైఎస్‌ది. 2004-09 మధ్య ఆయన తెలంగాణ ప్రాంతానికే అత్యధిక నిధులు ఖర్చు చేశారు.
వెనకబడ్డ తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ఆయ న ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో వరంగల్ జిల్లాలో, అందునా ఉప ఎన్నిక జరగనున్న లోక్‌సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనే బడుగు, బలహీనవర్గాలకు వైఎస్ ఎంతగానో ప్రయోజనం చే కూర్చారు. రాబోయే రోజుల్లో ప్రజలంతా వైఎస్సార్‌సీపీని దీవిస్తారు. వరంగల్ జిల్లాలో షర్మిలమ్మ చేపట్టిన పరామర్శ యాత్రకు వచ్చిన స్పందనే అందుకు నిదర్శనం’’ అన్నారు. ప్రజా సమస్యలపై తెలంగాణలో మొట్టమొదట రైతుదీక్షను చేపట్టిందే వైఎస్సార్‌సీపీ అని చెప్పారు. సమస్యల పరి ష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనందున ప్రజల పక్షాన నిలబడి వైఎస్సార్‌సీపీ పోరాడుతుందన్నారు. తాము ఏ పార్టీ కోసమో అభ్యర్థిని నిలపడం లేదని చెప్పారు.
1న వరంగల్‌లో జిల్లా పార్టీ విస్తృత భేటీ
నవంబర్ 1న వరంగల్‌లో పొంగులేటి అధ్యక్షతన వరంగల్ జిల్లా పార్టీ విస్తృత సమావేశం జరగనుంది. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు తదితర నేతలు ఇందులో పాల్గొంటారని శివకుమార్ తెలిపారు.