2వేల మంది వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల అరెస్ట్ | YSRCP activists arrested in chittor district | Sakshi
Sakshi News home page

2వేల మంది వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల అరెస్ట్

Jan 18 2016 3:18 AM | Updated on May 29 2018 4:23 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు నిరసనగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మొదలయ్యాయి.

తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు నిరసనగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మొదలయ్యాయి. రాజంపేట ఎంపీతో పాటు మరో ఆరుగురు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంపై వేలాదిగా పార్టీనేతలు శ్రీకాళహస్తికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో కుప్పం నుంచి వస్తున్న వందలాది మంది కార్యకర్తల్ని అరెస్ట్ చేసి, వారి వాహనాలను సీజ్ చేశారు.

పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేస్తున్న వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నారు. పార్టీ ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, తదితర నేతలు శ్రీకాళహస్తికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 2 వేల మందికి పైగా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement