ఉత్సాహంగా వైఎస్‌ఆర్‌ స్మారక పోటీలు | YSR memorial competitions | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా వైఎస్‌ఆర్‌ స్మారక పోటీలు

Aug 28 2016 1:16 AM | Updated on Sep 4 2017 11:10 AM

ఉత్సాహంగా వైఎస్‌ఆర్‌ స్మారక పోటీలు

ఉత్సాహంగా వైఎస్‌ఆర్‌ స్మారక పోటీలు

దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా వైఎస్‌ఆర్‌ అభిమాన సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు జరుగుతున్నాయి

 
నిజామాబాద్‌ స్పోర్ట్స్‌ : దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా వైఎస్‌ఆర్‌ అభిమాన సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు జరుగుతున్నాయి. శనివారం సీఎస్‌ఐ మైదానంలో క్రికెట్‌ పోటీలు ప్రారంభించారు. సెప్టెంబర్‌ 2న వైఎస్‌ఆర్‌ వర్ధంతి సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్న ట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన క్రికెట్‌ పోటీల్లో ఆరు జట్లు పాల్గొన్నాయి. లీగ్‌స్థాయి మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఆదివారం సెమీస్, ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. అలాగే వాలీవాల్‌ పోటీలు డీఎస్‌ఏ మైదానంలో జరగనున్నాయి. వైఎస్‌ఆర్‌ అభిమాన సంఘం ప్రతినిధులు, నిర్వాహకులు జయప్రసాద్, జ్యోతిరాజ్, సుభాష్, శోభన్‌బాబు, బెనర్జీ, చరణ్‌లు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement