‘తెలుగు వైభవం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

‘తెలుగు వైభవం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌

Published Wed, Jan 25 2017 1:28 AM

‘తెలుగు వైభవం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌ - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ రచయిత మర్రిపూడి దేవేంద్ర రావు సంకలనం చేసిన ‘తెలుగు వైభవం’ అనే పుస్త కాన్ని విపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన నివాసం లో ఆవిష్కరించారు. తెలుగు కళామతల్లికి తన సామ్రాజ్యమంతా చలువ పందిళ్లు వేయించిన ఘనత శ్రీకృష్ణదేవరాయలదైతే.. తెలుగుకు వెలుగునిచ్చే ప్రాచీన హోదాకోసం శ్రమించిన తెలుగు తల్లి ముద్దుబిడ్డగా దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గణుతి కెక్కారని దేవేంద్రరావు ఈ సందర్భంగా అభివర్ణించారు.

పార్టీ శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తెలుగు సంప్రదాయానికి ఆయువుపట్టు అయిన పంచెకట్టుతో తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసిన మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. తెలుగు భాష, జాతి ఔన్నత్యాన్ని చాటారని కొనియాడారు. వైఎస్సార్‌ స్మారక ఫౌండేషన్‌ కర్ణాటక శాఖ కార్యదర్శి పి.రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు సంవత్సరాలు 60, రాజన్న జీవన యానం 60, దీనికి ప్రతీకగా 60కి పైగా కవి వరేణ్యులతో ‘తెలుగు వైభవం’పై తిరుపతిలో జాతీయ సమ్మేళనాన్ని అతి త్వరలో భారీఎత్తున నిర్వహించబోతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సేవాదళ్‌ నేత జి.లక్ష్మీపతి కూడా పాల్గొన్నారు.

Advertisement
Advertisement