ముగిసిన వైఎస్ జగన్ విశాఖ పర్యటన | ys Jagan mohan reddy completes vizag tour | Sakshi
Sakshi News home page

ముగిసిన వైఎస్ జగన్ విశాఖ పర్యటన

Feb 18 2016 1:32 PM | Updated on Jul 25 2018 4:07 PM

విశాఖ పర్యటన ముగించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు.

విశాఖ : విశాఖ పర్యటన ముగించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. ఆయన ఇవాళ విశాఖలో బిజీ బిజీగా గడిపారు. ముందుగా వైఎస్ జగన్ ఇటీవల వివాహం జరిగిన ఐఎన్టీయుసీ నేత మంత్రి రాజశేఖర్ కుమార్తె మౌనిక, శివ కళ్యాణ్‌ దంపతులను ఆశీర్వదించారు.

 

అనంతరం  పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠానికి  వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పెందుర్తిలోని పార్టీ ప్రధాన కార్యదర్శి గొర్లె రామునాయుడు నివాసానికి వెళ్లి, ఇటీవలే వివాహం చేసుకున్న ఆయన కుమార్తె మాధవి-నితీష్ కుమార్ జంటను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాలు అన్నీ ముగించుకుని  వైఎస్ జగన్ హైదరాబాద్ బయల్దేరారు.

Advertisement
 
Advertisement
Advertisement