వర్షాల ఇబ్బందులపై వైఎస్ జగన్ ఆరా | ys jagan consults district incharges of rain effected areas | Sakshi
Sakshi News home page

వర్షాల ఇబ్బందులపై వైఎస్ జగన్ ఆరా

Nov 17 2015 9:58 PM | Updated on May 29 2018 4:26 PM

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలం అయిన నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు.

హైదరాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలం అయిన నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు.

ఆయన ఈ మూడు జిల్లాల పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్థన్‌రెడ్డి(నెల్లూరు), చిత్తూరు (కళత్తూరు నారాయణస్వామి), కడప (అమరనాథ్‌రెడ్డి)తో మంగళవారం విడివిడిగా ఫోన్‌లో మాట్లాడి జిల్లాల్లో పరిస్థితిని తెలుసుకున్నారు. జనజీవనాన్ని వర్షాలు బాగా ఇబ్బంది పెట్టాయని, రహదారులు బాగా దెబ్బ తిన్నాయని జిల్లా అధ్యక్షులు వైఎస్ జగన్‌కు వివరించగా అప్రమత్తంగా ఉండాలని వారికి ఆయన సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement