మహా కుంభాభిషేకంలో పాల్గొన్న వైఎస్ జగన్ | YS Jagan attend Visakha Sri Sarada Peetham maha kumbhabhishekam | Sakshi
Sakshi News home page

మహా కుంభాభిషేకంలో పాల్గొన్న వైఎస్ జగన్

Feb 18 2016 12:17 PM | Updated on Jul 25 2018 4:07 PM

మహా కుంభాభిషేకంలో పాల్గొన్న వైఎస్ జగన్ - Sakshi

మహా కుంభాభిషేకంలో పాల్గొన్న వైఎస్ జగన్

విశాఖ పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదా పీఠంలో జరుగుతున్న మహా కుంభాభిషేకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం హాజరయ్యారు.

విశాఖ : విశాఖ పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠంలో జరుగుతున్న మహా కుంభాభిషేకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం హాజరయ్యారు.  పవిత్ర స్నానానంతరం వైఎస్ జగన్ పట్టువస్త్రాలు ధరించి కుంభాభిషేకంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ...వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు.  కుంభాభిషేకం అనంతరం స్వరూపానందేంద్ర స్వామి కొద్దిసేపు వైఎస్ జగన్ తో ముచ్చటించారు.

కాగా గత ఏడాది జనవరి 27న కూడా శారదా పీఠం వార్షికోత్సవాల్లో వైఎస్ జగన్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొర్లె రామునాయుడు నివాసానికి వెళ్లి, ఇటీవలే వివాహం చేసుకున్న ఆయన కుమార్తె మాధవి-నితీష్ కుమార్ జంటను ఆశీర్వదిస్తారు.


 

Advertisement
 
Advertisement
Advertisement