పిల్లలతో డాన్సులు చేయడం సిగ్గుమాలిన చర్య:జడ్జి | your attitude is not in right way dancing with college students, gunturu judge to principle | Sakshi
Sakshi News home page

పిల్లలతో డాన్సులు చేయడం సిగ్గుమాలిన చర్య:జడ్జి

Aug 7 2015 11:58 AM | Updated on Aug 24 2018 2:36 PM

పిల్లలతో డాన్సులు చేయడం సిగ్గుమాలిన చర్య:జడ్జి - Sakshi

పిల్లలతో డాన్సులు చేయడం సిగ్గుమాలిన చర్య:జడ్జి

నాగార్జున యూనివర్శిటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు ప్రధాన కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావుపై గుంటూరు జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుంటూరు: నాగార్జున యూనివర్శిటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు ప్రధాన కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావుపై గుంటూరు జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  పిల్లలతో ప్రిన్సిపాల్ డాన్సులు చేయడం సిగ్గుమాలిన చర్య అని బాబూరావు వైఖరిని తప్పుబట్టారు.  శుక్రవారం ప్రిన్సిపాల్ బాబూరావుతో పాటు వార్డెన్ స్వరూప రాణిలు లీగల్ సెల్ అథారిటీ ముందు హాజరైన క్రమంలో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఇంత జరిగినా కనీసం మీలో పశ్చాత్తాపం కనబడుటం లేదు. కనీసం  మీ నాన్నకు నీవైనా చెప్పంటూ పక్కనున్న ప్రిన్సిపాల్ కొడుకును చూస్తూ జడ్జి వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా రిషితేశ్వరి ఆత్మహత్య పై సుమోటోగా స్వీకరించిన కేసును లీగల్ సెల్ అథారిటీ కొట్టేసింది. గురువారం వీసి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేస్తున్నందున అంతకుముందు కోర్టు స్వీకరించిన సుమోటో కేసును జడ్జి కొట్టివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement