తలను వేరు చేసి అతికిరాతకంగా.. | youngmen killed brutally in santhoshnagar | Sakshi
Sakshi News home page

తలను వేరు చేసి అతికిరాతకంగా..

Aug 7 2016 11:00 PM | Updated on Aug 1 2018 2:10 PM

కంచన్‌బాగ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో దుండగులు యువకుడిని అతికిరాతకంగా హత్య చేశారు.

సంతోష్‌నగర్‌: దుండగులు ఓ యువకుడిని అతికిరాతకంగా హత్య చేశారు.  కంచన్‌బాగ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది.  పోలీసుల ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం... బాలాపూర్‌ నీటి ట్యాంక్‌ సమీపంలో  25 ఏళ్ల గుర్తు తెలియని యువకుడ్ని దుండగులు సిమెంట్‌ ఇటుకలతో తలపై కొట్టి చంపేశారు. మృతుడిని ఎవ్వరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు తలను వేరు చేశారు. తీవ్ర దుర్వాసన వస్తుండటంతో శనివారం ఈ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండటం బట్టి 15 రోజుల క్రితమే హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement