ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని.. | younger suicide attempt for love | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని..

Jan 8 2017 10:36 PM | Updated on Oct 4 2018 5:35 PM

ప్రేమ పెళ్లి చేయడానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని ఓ యువకుడు గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

హిందూపురం రూరల్‌ : ప్రేమ పెళ్లి చేయడానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని ఓ యువకుడు గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. హిందూపురంలోని రహమత్‌పుర్‌కు చెందిన తాజుద్దీన్‌ అదే ప్రాంతంలోని ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయాన్ని అమ్మాయి తల్లిదండ్రులకు తెలిపి.. పెళ్లి చేయాలని కోరగా.. వారు నిరాకరించారు.

దీంతో మనస్తాపానికి గురైన తాజుద్దీన్‌ ధర్మపురంలోని తన టీస్టాల్‌లో చాకుతో గొంతు కోసుకున్నాడు. అక్కడున్న వారు గుర్తించి వెంటనే అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరులోని నిమ్హాన్స్‌కు తరలించారు. వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement