-
ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని..
హిందూపురం రూరల్ : ప్రేమ పెళ్లి చేయడానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని ఓ యువకుడు గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. హిందూపురంలోని రహమత్పుర్కు చెందిన తాజుద్దీన్ అదే ప్రాంతంలోని ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయాన్ని అమ్మాయి తల్లిదండ్రులకు తెలిపి.. పెళ్లి చేయాలని కోరగా.. వారు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన తాజుద్దీన్ ధర్మపురంలోని తన టీస్టాల్లో చాకుతో గొంతు కోసుకున్నాడు. అక్కడున్న వారు గుర్తించి వెంటనే అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరులోని నిమ్హాన్స్కు తరలించారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
తాజుద్దీన్కి 14 రోజుల పోలీస్ కస్టడీ
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీంకు కుడి భుజంగా వ్యవహరించి అతని ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టిన ప్రధాన అనుచరుడు తాజుద్దీన్ కు కోర్టు 14 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. బుధవారం గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు ఈ రోజు రాజేంద్రనగర్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు అతడికి 14 రోజుల పోలీస్ కస్టడీకి ఆదేశించింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ. 2 కోట్ల నగదుతో పాటు విలువైన పత్రాలను కోర్టు ముందు ఉంచగా.. బ్యాంకులో డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. Nayeem's encounter, tajuddin, police custod -
నిన్ను ప్రేమించని అమ్మాయి కోసమైనా..
నువ్వు బతికి ఉండాల్సింది తాజుద్దీన్..! ప్రేమ ఇంకో ఆత్మహత్య! ఆదివారం తెల్లారే ఫస్ట్ అవర్‌లో. విజయవాడ అబ్బాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్. సత్యనారాయణపురం పోలీసులు పిలిచి మందలించారని, ఇంటికి రాగానే ఆత్మహత్య చేసుకున్నాడనీ న్యూస్. తాజుద్దీన్ అట పేరు. అందంగా ఉన్నాడు. పెళ్లిచూపుల్లో - ‘అబ్బాయి బాగున్నాడే..’ అని అమ్మాయి ఫ్రెండ్స్ చాటుగా ఆమె బుగ్గ గిల్లేంత అందంగా! అందం ఉండి, మంచి ఉద్యోగం ఉండీ ఎందుకు చనిపోయాడు? అవి రెండూ లెక్కలోకి రాలేదు తాజుద్దీన్కి. ‘తను’ లేకుండా జీవితమే లేదు అనుకున్నాడు. ‘తను’ అంటే తాజుద్దీన్ ప్రేమించిన అమ్మాయి. ఇప్పుడు ‘తను’ ఏ మూలన పడి గుట్టుగా కన్నీళ్లు తుడుచుకుంటోందో... అతడి మరణవార్తను తట్టుకోలేక! అబ్బాయి తల్లి ఏడుస్తోంది. ‘నాకు నా కొడుకు కావాలి’ అని గుండెలు బాదుకుంటోంది. ఎక్కడి నుంచి వస్తాడు? పొద్దున్నే హర్ట్ అయి వెళ్లిపోయినవాడు?! తాజుద్దీన్ అక్కో, చెల్లో.. మీడియా కెమెరాల ముందు దుఃఖం ఆపుకుంటోంది. ‘ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆ అమ్మాయి మావాడిని మోసం చేసింది’ అని చెబుతోంది. ‘‘నువ్వా అమ్మాయి వెనక తిరక్కు. నీ మీద కంప్లైంట్ ఇచ్చింది’ అని పోలీసులు తాజుద్దీన్‌తో అన్నారట. ‘‘తట్టుకోలేకపోయాడు బాబూ.. పోలీసులు పిలవడం వాడికి అవమానం కాదు. తనకి ఇష్టం లేదని పిల్ల కంప్లైంట్ ఇచ్చిందట. ఇంట్లోకి వెళ్లి ఉరేసుకున్నాడు’’ - తల్లి తల్లడిల్లిపోతోంది. తాజుద్దీన్ ఫ్రెండ్స్ వడిలిపోయారు. సండే.. వాళ్ల ప్లాన్.. ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్. మాటైనా చెప్పకుండా ఆ మ్యాచ్‌ని రద్దు చేసేసి, తనను వద్దనుకున్న అమ్మాయిని వదిలేసి వెళ్లిపోయాడు తాజుద్దీన్. ఆ అమ్మాయి ఒక్కదాన్నే వదిలేస్తున్నానని అతడు అనుకున్నట్లుంది! ఆమెతో పాటు ఉదయాలను, సాయంత్రాలను వదిలేశాడు. చిట్టినగర్ని, సత్యనారాయణపురాన్ని, విజయవాడనీ వదిలేశాడు. గూగుల్‌ని, భూగోళాన్ని వదిలేశాడు. ఇవన్నీ వదిలేస్తే వదిలేశాడు. అసలా అమ్మాయి తనను వద్దనుకోవడం నిజమేనా అనే విషయాన్ని తెలుసుకోవాలన్న ఆలోచనను కూడా వదిలేశాడు! ఒకవేళ నిజంగానే ఆ అమ్మాయి తనని వద్దనుకుని ఉంటే! ఏముందీ? ప్రేమ ఉండదు. బాధ ఉంటుంది. మంచిదే కదా. ప్రేమకు టైమింగ్స్ ఉంటాయి. షిఫ్టులు ఉంటాయి. మధ్యమధ్యలో సిగ్నల్స్ పోతుంటాయి. సమ్‌టైమ్స్.. ప్రేమ స్విచాఫ్ కూడా అయిపోతుంటుంది. బాధ.. బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడూ మన వెంటే ఉంటుంది. ‘రారా.. నవరంగ్‌లో సినిమాకు పోదాం’ అంటుంది. ‘నడ్రా.. బీసెంట్ రోడ్‌కి’ అని సతాయిస్తుంటుంది. బతకలేమా ప్రేమ లేకుండా. ప్రేమించిన అమ్మాయి లేకుండా! ఎంత పని చేశావ్ తాజుద్దీన్!! నీ కోసం నీ వాళ్లంతా బాధపడుతున్నారు. నువ్వు ‘నా’ అనుకున్నవాళ్లు, నిన్ను ‘మా’ అనుకున్నవాళ్లు.. అంతా బాధపడుతున్నారు. వాళ్లందరి కోసం నువ్వు బతికుండాల్సింది. కనిపెంచిన అమ్మకోసం, కనిపెట్టుకుని ఉన్న నాన్న కోసం, నీ తోడబుట్టినవాళ్ల కోసం, నీ స్నేహితుల కోసం నువ్వు బతికి ఉండాల్సింది తాజుద్దీన్. వీళ్లందరినీ వదిలేయ్. కనీసం నిన్ను ‘ప్రేమించని’ ఆ అమ్మాయి కోసమైనా నువ్వు బతికి ఉండాల్సింది. తనకి నువ్విచ్చిన కానుకలు, తనకి నువ్విచ్చిన ‘బైక్ రైడింగ్’, తనకి నువ్వు స్పెండ్ చేసిన టైమ్.. అన్నీ ఆమెను దోషిగా నిలబెడుతున్నాయి ఇప్పుడు! నువ్వే బతికి ఉంటే అవన్నీ నీ సంతోషం కోసమే తప్ప, ఆమె సంతోషం కోసం కాదని చెప్పడానికి ఉండేది. అలా ఇంకోసారి ఆమెకు నువ్వు ‘ఐ లవ్యూ’ చెప్పినట్లూ ఉండేది. మాధవ్ శింగరాజు -
బంధువుల ఇంటికే కన్నం వేశాడు..!
ఇంట్లో ఉన్న వారంతా శుభకార్యానికి హాజరుకాగా దగ్గరి బంధువే చోరీకి పాల్పడ్డ ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎన్.రామారావు వెల్లడించిన వివరాల ప్రకారం.. బండ్లగూడ ఇస్మాయిల్ నగర్‌కు చెందిన సయ్యద్ ఇబ్రహీం కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 3వ తేదీన రాత్రి జహంగీరాబాద్‌లోని కూతురు ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి వెళ్లాడు. కాగా, ఈ విషయాన్ని గమనించిన ఇబ్రహీం అల్లుడి తమ్ముడు తాజుద్దీన్(27) దొంగతనానికి ప్లాన్ వేశాడు. ఇంటి తాళం పగులకొట్టి, అల్మారాలో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలు, రూ.21,300 నగదు చోరీ చేశాడు. ఏమీ తెలియనట్లు తిరిగి ఇంటికి వెళ్లి, బంధువులతో కలిసి పోయాడు. మరుసటి రోజు ఉదయం ఇంటికి వెళ్లి చూసిన ఇబ్రహీం దొంగతనం జరిగిందని గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా తాజుద్దీనే నిందితుడని తేలింది. దీంతో అతడిని అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. అతని నుంచి రెండు తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేలు స్వాదీనం చేసుకున్నారు. కాగా, ఇబ్రహీం కూడా తన ఇంట్లో నాలుగు తులాల బంగారు ఆభరణాలు, రూ.1.2 లక్షల నగదు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు అది వట్టిదేనని తేల్చటం కొసమెరుపు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పండి
అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి
ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఉండొద్దు
రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం..
పోలీస్ ప్రజావాణికి ఐదు అర్జీలు
మోదీ గుండెలో సంజయ్‌కి ప్రత్యేక స్థానం
బీజేపీని ఓడించడమే లక్ష్యం
పక్కాగా ఈవీఎంల కమిషనింగ్
ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన
వానాకాలం సాగు ఖరారు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement