పెదపాడు మండలానికి చెందిన యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. పెదపాడు మండలం వట్లూరు పంచాయతీ శౌరిపురం గ్రామానికి చెందిన బొబ్బిలి రాయప్ప, చంటి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరి కుమారుడు వినోద్‌కుమార్ (25) డిగ్రీ వరకూ చదువుకుని కొంతకాలంగా ఏలూరులోని ఓ వ్యాపార సంస్థలో పనిచేస్తున్నాడు.
యువకుడి ఆత్మహత్య
Sep 17 2016 9:14 PM | Updated on Sep 4 2017 1:53 PM
ఏలూరు అర్బన్: పెదపాడు మండలానికి చెందిన యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. పెదపాడు మండలం వట్లూరు పంచాయతీ శౌరిపురం గ్రామానికి చెందిన బొబ్బిలి రాయప్ప, చంటి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరి కుమారుడు వినోద్‌కుమార్ (25) డిగ్రీ వరకూ చదువుకుని కొంతకాలంగా ఏలూరులోని ఓ వ్యాపార సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం వినోద్‌కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుమందు తాగాడు. దీనిని గమనించిన ఇరుగుపొరుగు వారు తల్లిదండ్రులకు సమాచారం అందించి బాధితుడ్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా వినోద్‌కుమార్ మతి చెందాడు.
Advertisement
Advertisement