పంట ఎండిపోయిందనే మనస్తాపంతో ఈ నెల 24న పురుగుల మందు తాగిన యువరైతు జార వెంకటేశ్(25) చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు.
టేకులపల్లి(ఖమ్మం జిల్లా): పంట ఎండిపోయిందనే మనస్తాపంతో ఈ నెల 24న పురుగుల మందు తాగిన యువరైతు జార వెంకటేశ్(25) చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. వివరాలు..టేకులపల్లి మండలం ముత్యాలంపాడు పంచాయతీ తూర్పుగూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్ తనకున్న ఐదు ఎకరాల్లో పత్తి పంట సాగుచేశాడు. వర్షాభావంతో ఆశించిన మేరకు పంట పండలేదు.
దీంతో రూ.2 లక్షల వరకు అప్పులు మిగలడంతో మనస్తాపానికి గురైన వెంకటేశ్ ఈ నెల 24న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం తెలిసి కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కొత్తగూడెం తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు.