ఉత్తమ జిల్లా కలెక్టర్‌గా యోగితా రాణా | Yogita Rana The best district collector | Sakshi
Sakshi News home page

ఉత్తమ జిల్లా కలెక్టర్‌గా యోగితా రాణా

Aug 15 2016 3:34 AM | Updated on Sep 28 2018 7:14 PM

ఉత్తమ జిల్లా కలెక్టర్‌గా యోగితా రాణా - Sakshi

ఉత్తమ జిల్లా కలెక్టర్‌గా యోగితా రాణా

తెలంగాణ లో ఉత్తమ కలెక్టర్‌గా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణాను ప్రభుత్వం ఎంపిక చేసింది.

నేడు కేసీఆర్ చేతుల మీదుగా అవార్డు
ఇందూరు: తెలంగాణ లో ఉత్తమ కలెక్టర్‌గా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణాను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఏడాదిలోనే  యోగితా రాణా ప్రభుత్వం, ప్రజలు, ప్రజాప్రతినిధులతో తన పనితనంతో భేష్ అనిపించుకున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు హరితహారంలో లక్ష్యాన్ని సాధించి జిల్లాను ముందు వరుసలో నిలబెట్టారు. జిల్లాకు నిర్దేశించిన 3.35 కోట్ల మొక్కలు నాటే లక్ష్యానికి గాను ఈ నెల 13 నాటికే 3.36 కోట్ల మొక్కలు నాటించారు. సోమవారం హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ యోగితా రాణా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement