యోగాతో సంపూర్ణ ఆరోగ్యం | Yoga is perfect to health | Sakshi
Sakshi News home page

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

Jul 3 2017 12:12 PM | Updated on Sep 5 2017 3:06 PM

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

ప్రతిరోజు యోగా సాధన చేయడం వల్ల ఎలాంటి రోగాలు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

మహబూబ్‌నగర్‌: ప్రతిరోజు యోగా సాధన చేయడం వల్ల ఎలాంటి రోగాలు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మయూరీ నర్సరీ (హరితవనం)లో ఆదివారం యోగా శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే యోగా అభ్యాసకులతో కలిసి యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం హర్షించదగ్గ విషయమన్నారు.

యోగాతో దీర్ఘకాలిక రోగాలు కూడా నయమవుతున్నాయని, ప్రతిఒక్కరూ గంటసేపు యోగా చేయాలని పిలుపునిచ్చారు. పట్టణ శివారులో ఆహ్లాదకరమైన వాతావరణంలో మయూరీ నర్సరీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నర్సరీలో యోగా అభ్యాసకుల కోసం ప్రత్యేకంగా యోగా సెంటర్‌ను నిర్మించామన్నారు. నర్సరీని మరింత అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఒక మాడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో పలువురు యోగా అభ్యాసకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement