తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజూ శ్రీవారి మొదటి దర్శనం చేసే గొల్లవారిని సాగనంపేందుకు టీటీడీ బోర్డు ప్రయత్నిస్తే సహించేది లేదని యాదవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలిగేపల్లి శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజూ శ్రీవారి మొదటి దర్శనం చేసే గొల్లవారిని సాగనంపేందుకు టీటీడీ బోర్డు ప్రయత్నిస్తే సహించేది లేదని యాదవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలిగేపల్లి శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత కొన్నేళ్లుగా గొల్లవారు శ్రీవారి మొదటి దర్శనం చేసుకునే ఆనవాయితీ కొనసాగుతుందని.. పదవీ విరమణ పేరుతో గొల్లలను సాగనంపేందుకు టీటీడీ బోర్డు చర్యలు చేపడుతుందన్నారు. యాదవులకు అన్యాయం చేస్తే ఊరుకోమన్నారు. ఇప్పటికైనా టీడీడీ బోర్డు అధికారులు అర్చకుల మాదిరిగానే యాదవులను కొనసాగించాలన్నారు. లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు.