9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం | world aadivaasi day at 9th | Sakshi
Sakshi News home page

9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

Aug 5 2016 11:55 PM | Updated on Sep 4 2017 7:59 AM

రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు గిరిజన ఐక్యవేదిక జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి వెంకటస్వామి, బీ కృష్ణానాయక్‌ తెలిపారు.

కర్నూలు(అర్బన్‌): రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు గిరిజన ఐక్యవేదిక జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి వెంకటస్వామి, బీ కృష్ణానాయక్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక ఐక్యవేదిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగులకు ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు మధ్యాహ్నం వరకు అనుమతిని ఇవ్వాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని తండాలు, గూడేల్లో ఉత్సవాలను నిర్వహించాలన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement