స్వచ్ఛభారత్‌ కోసం కృషి చేద్దాం | work for swaccha bharath | Sakshi
Sakshi News home page

స్వచ్ఛభారత్‌ కోసం కృషి చేద్దాం

Jul 28 2016 9:47 PM | Updated on Sep 4 2017 6:46 AM

సమావేశంలో మాట్లాడుతున్న జయదీప్‌ ఆర్యా

సమావేశంలో మాట్లాడుతున్న జయదీప్‌ ఆర్యా

స్వచ్ఛ భారత్‌ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని భారత్‌ స్వాభిమాన్‌ కేంద్ర ప్రభారి డా. జయదీప్‌ ఆర్యా పిలుపునిచ్చారు.

  • భారత్‌ స్వాభిమాన్‌ కేంద్ర ప్రభారి డా. జయదీప్‌ ఆర్యా
  • జిన్నారం: స్వచ్ఛ భారత్‌ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని భారత్‌ స్వాభిమాన్‌ కేంద్ర ప్రభారి డా. జయదీప్‌ ఆర్యా పిలుపునిచ్చారు. గురువారం జిన్నారం మండలం అన్నారంలోని ప్రకతి నివాస్‌లో భారత్‌ స్వాభిమాన్, పతంజలి యోగా సమితి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్‌ జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశాశం నిర్వహించారు.

    సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జయదీప్‌ ఆర్యా మాట్లాడుతూ ప్రజలంతా ఆరోగ్యంగా జీవించాలని పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో స్వామి రాందేవ్‌ బాబా ప్రపంచ వ్యాప్తంగా యోగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. రసాయనాలతో పండిస్తున్న ఆహార ధాన్యాలు, అనారోగ్యాన్ని కల్గిస్తున్నాయన్నారు.

    దేశ వ్యాప్తంగా సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు కార్యక్రమంలో çభారత్‌ స్వాభిమాన్‌ రాష్ట్ర అద్యక్షుడు శ్రీధర్‌రావు, మహిళా ప్రభారి మంజుశ్రీ, పతంజలి రాష్ట్ర అధ్యక్షుడు శివుడు, కిసాన్‌ యువజన రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ, పటాన్‌చెరు నియోజకవర్గ  ప్రభారి విఠల్, పశ్చిమ జిల్లా అధ్యక్షుడు గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement